1998 డీఎస్సీ అభ్యర్థులకు 33వేల వేతనం
మినిమం టైమ్ స్కేలు’పై ఉత్తర్వులు.. అభ్యర్థుల ఆసక్తి కోరిన విద్యాశాఖ
అమరావతి, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): 1998 డీఎస్సీ అభ్యర్థులను కాంట్రాక్టు పద్ధతిలో ఎస్జీటీలుగా తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గురువారం పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది. 1998 అభ్యర్థులకు మినిమం టైమ్ స్కేలు వర్తింపజేయనున్నట్లు తెలిపింది. అంటే నెలకు రూ.33వేల వేతనం వారికి లభిస్తుంది. వీరిని డీఈవో పూల్‌లో ఉంచి, అవసరమైన చోట్లకు సర్దుబాటు చేయనుంది. కేజీబీవీల్లో ఉపాధ్యాయులుగా, సీఆర్‌పీలుగా, మోడల్ స్కూల్స్‌లో గెస్ట్ లెక్చరర్లుగా వీరిని వినియోగించుకోనున్నట్లు తెలిపింది. అయితే సుదీర్ఘకాలం తర్వాత వారిని విధుల్లోకి తీసుకోవాలని నిర్ణయించినందున ఎంతమంది ఉద్యోగాలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నారో వివరాలు తీసుకోవాలని జిల్లాల అధికారులను ఆదేశించింది. డీఎస్సీ 2008 అభ్యర్థుల తరహాలోనే వీరిని తీసుకుంటున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది
0 Response to "1998 డీఎస్సీ అభ్యర్థులకు 33వేల వేతనం"
Post a Comment