జీపీఎస్‌పై ఉద్యోగ సంఘాలతో ఇంటెలిజెన్స్ సమావేశం
*📚✍️✍️📚*
*🌻ఈనాడు, అమరావతి:* కాంట్రిబ్యూటరీ పింఛన్ పథకం (సీపీఎస్) స్థానంలో హామీ పింఛన్ పథకం (జీపీఎస్) తీసుకురావాలని యోచిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఇంటెలిజెన్స్ విభాగం ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలను సేకరిస్తోంది. జీపీఎస్‌ను సంఘాలు వ్యతిరేకిస్తుండటంతో ఏ సంఘం అనుకూలంగా ఉంది? ఎవరు వ్యతిరేకిస్తున్నారు? అనే వివరాలను తెలుసుకుంటోంది. విజయవాడలో బుధవారం ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో ఇంటెలిజెన్స్ అధికారులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య ఏర్పడిన అంతరం, సమస్యలు ఏంటని ఇంటెలిజెన్స్ అధికారులు అడిగి తెలుసుకున్నారు. పాత పింఛన్ విధానం ప్రభుత్వానికి ఎలా భారంగా మారుతుందో తెలిపేందుకు 70 ఏళ్లకు అంచనా వేశారని, అప్పటికి ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని ప్రకటించలేదని కొన్ని సంఘాల నాయకులు పేర్కొన్నారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
0 Response to "జీపీఎస్‌పై ఉద్యోగ సంఘాలతో ఇంటెలిజెన్స్ సమావేశం"
Post a Comment