9 నుంచి జూన్ 10 వరకు హైకోర్టుకు వేసవి సెలవులు
అమరావతి, మే 7(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర హైకోర్టుకు ఈ నెల మే 9 నుం చి జూన్ 10వరకు వేసవి సెలవులు ప్రకటించారు. తిరిగి జూన్ 13నుంచి కోర్టు కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి.
ఈ నేపథ్యంలో అత్యవసర వ్యాజ్యాల విచారణకు వెకేషన్ కోర్టులు ఏర్పాటు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. మొదటి దశ వెకేషన్ కోర్టులు ఈ నెల 12, 19, 26వ తేదీల్లో విచారణలు చేపడతాయి. న్యాయమూర్తులు జస్టిస్ కె.మన్మథరావు,
జస్టిస్ తర్లా డ రాజశేఖరరావు, జస్టిస్ చీమలపాటి రవి సింగిల్ జడ్జిగా విచారణలు జరుపుతారు. రెండో దశ వెకేషన్ కోర్టులు జూన్ 2, 9వ తేదీల్లో విచారణ జరగనున్నాయి.
జస్టిస్ యు.దుర్గాప్రసాదరావు, జస్టిస్ బి.కృష్ణమోహన్, జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు విచారణలు నిర్వహిస్తారు
0 Response to "9 నుంచి జూన్ 10 వరకు హైకోర్టుకు వేసవి సెలవులు"
Post a Comment