1 శాతం దాటిన కొవిడ్ పాజిటివిటీ రేటు
దేశంలో 2 నెలల తర్వాత తొలిసారి.. 3157 కొత్త కేసులు
సోమవారం ఉదయం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా 3157 కరోనా కొత్త కేసులు నమోదవగా, 26 మంది మరణించారు. 24 గంటల్లోనే క్రియాశీల కేసుల సంఖ్య 408 పెరిగి 19500కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
రోజువారీ పాజిటివిటీ రేటు 1.07 శాతానికి చేరింది. చివరిసారిగా ఫిబ్రవరి 27న 1.11 శాతంగా నమోదైంది. పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉంటే వైరస్ వ్యాప్తి కూడా ఎక్కువగా ఉన్నట్లే. ఇక..
చైనాలో కొవిడ్ వైరస్ ఉధృతికి కారణాన్ని ఆర్‌పీజీ ఎంటర్‌ప్రైజెస్ చైర్మన్ హర్ష గోయెంకా వెల్లడించారు. ‘‘ప్రస్తుతం చైనాలో కొవిడ్ కేసులు ఎందుకు పెరుగుతున్నాయని స్వామి హర్షానందను అడిగా. అప్పుడాయన.. వైరస్ బాగా అలసిపోయింది.
ఇంటి నుంచి పని చేయాలని కోరుకుందని సమాధానమిచ్చారు’’ అని గోయెంకా ట్విటర్‌లో సరదాగా పేర్కొన్నారు
0 Response to "1 శాతం దాటిన కొవిడ్ పాజిటివిటీ రేటు"
Post a Comment