పెరగబోతున్న కేంద్ర ఉద్యోగుల వేతనాలు...






కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ కానుక రాబోతుంది. ఉద్యోగులు సుదీర్ఘ కాలంగా డిమాండ్ చేస్తోన్న ఫిట్‌మెంట్‌ ఫ్యాక్టర్‌ను పెంచబోతున్నట్టు తెలుస్తోంది.


దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు కూడా పెరనున్నాయి. పలు మీడియా రిపోర్టుల ప్రకారం, ఫిట్‌మెంట్‌ ఫ్యాక్టర్‌ పెంచేందుకు ప్రభుత్వం త్వరలోనే ఆమోద ముద్ర వేయనున్నట్టు తెలుస్తోంది. కనీస వేతనాలను పెంచాలని చాలా కాలంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. కనీస వేతనాన్ని రూ.18 వేల నుంచి రూ.26 వేలు చేయాలని కోరుతున్నారు.

ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 2.57 టైమ్స్ నుంచి 3.68 టైమ్స్ పెంచాలని అడుగుతున్నారు. ఒకవేళ ప్రభుత్వం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను పెంచితే.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనం కూడా పెరగనుంది. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను పెంచడం వల్ల, కనీస వేతనం కూడా పెరుగుతుంది.

ప్రస్తుతం ఉద్యోగులు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57 రెట్లతో రూ.18 వేల బేసిక్ వేతనం లభిస్తుంది. ఒకవేళ 3.68 రెట్ల ఫిట్‌మెంట్ ప్రకటిస్తే.. బేసిక్ వేతనం రూ.8 వేల వరకు పెరగనుంది. అంటే బేసిక్ వేతనం రూ.18 వేల నుంచి రూ.26 వేలకు పెరగనుంది.

ప్రభుత్వ ఉద్యోగుల మూల వేతనాన్ని లెక్కించేందుకు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఉపయోగపడుతుంది. ఈ వేతనం ఆధారంగానే డీఏ, అలవెన్స్‌లను లెక్కిస్తారు. ఏడవ వేతన సంఘం సిఫారసులను కేంద్ర కేబినెట్ 2017 జూన్‌లో ఆమోదించింది. అప్పుడు బేసిక్ వేతనాన్ని రూ.7 వేలు పెంచి, రూ.18 వేలకు తెచ్చింది. అదేవిధంగా సెక్రటరీ స్థాయి ఉద్యోగుల వేతనాన్ని రూ.90 వేల నుంచి రూ.2.5 లక్షలకు పెంచింది. క్లాస్ 1 ఆఫీసర్ల ప్రారంభ వేతనం రూ.56,100గా ఉంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "పెరగబోతున్న కేంద్ర ఉద్యోగుల వేతనాలు..."

Post a Comment