ప్రభుత్వ పాఠశాలల్లో చదివితే నెలకు రూ.వెయ్యి
విద్యార్థినుల ఉన్నత విద్య కోసం తమిళనాడు ప్రభుత్వ నిర్ణయం
చెన్నై, మార్చి 18(ఆంధ్రజ్యోతి): 6వ తరగతి నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుని ఉన్నత చదువులకు వెళ్లే బాలికలకు
ఇకపై నెలకు రూ.1000 చొప్పున అందజేయనున్నట్టు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ఆర్థికమంత్రి పీటీఆర్ పళనివేల్ త్యాగరాజన్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఈ పథకం గురించి శుక్రవారం పేర్కొన్నారు.
ఈ పథకం ద్వారా 6 లక్షల మంది లబ్ధి పొందుతారని తెలిపారు

0 Response to "ప్రభుత్వ పాఠశాలల్లో చదివితే నెలకు రూ.వెయ్యి"
Post a Comment