5న ఏలూరులో సీపీఎస్ ఉద్యోగుల శంఖారావం
రాజమహేంద్రవరం, మార్చి 18(ఆంధ్రజ్యోతి): సీపీఎస్ రద్దు చేస్తానని హామీ ఇచ్చిన సీఎం జగన్ కాలయాపన చేయడాన్ని నిరసిస్తూ వచ్చే నెల 5వ తేదీన ఏలూరులో సీపీఎస్ ఉద్యోగుల శంఖారావం నిర్వహించనున్నట్టు ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏపీసీపీఎ్‌సఈఏ) రాష్ట్ర అధ్యక్షుడు రొంగల అప్పలరాజు, ప్రధాన కార్యదర్శులు కర్రి పార్ధసారధి తెలిపారు.
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరలో శుక్రవారం జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో వారు మాట్లాడారు. ఉద్యోగులంతా ఏకమై ప్రభుత్వ వైఖరికి నిరసన తెలియజేయాలని,
దాని కోసం ప్రతి ఉద్యోగీ తన కుటుంబ సభ్యులతో కలసి ఈ శంఖారావానికి హాజరవ్వాలని పిలుపునిచ్చారు. సీపీఎ్‌సను రద్దు చేసేవరకూ ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు.
సమావేశంలో సీపీఎ్‌సఈఏ జిల్లా అధ్యక్షుడు ఏజీ కృష్ణ, రాష్ట్ర ప్రతినిధులు గుర్రం మురళీమోహన్, ఎస్‌ఎ్‌సఎస్ జయరాం తదితరులు పాల్గొన్నారు
0 Response to "5న ఏలూరులో సీపీఎస్ ఉద్యోగుల శంఖారావం"
Post a Comment