సోమవారం నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం
అమరావతి: రాష్ట్రంలో ఈనెల 4 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు శుక్రవారం ఉదయం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని విద్యార్థుల ఆరోగ్య భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఉదయం 7:30 గంటల నుంచి 11.30 గంటల వరకు పాఠశాలల నిర్వహణ ఉంటుందన్నారు. అలాగే ఏప్రిల్ 27 నుంచి 10వ తరగతి పరీక్షలు, మే 6 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగనున్నట్లు మంత్రి సురేష్ తెలిపారు
ఈనెల 4 (సోమవారం) నుంచి ఒంటిపూట బడులు
వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని విద్యార్థుల ఆరోగ్య భద్రత కోసం నిర్ణయం.
ఉదయం 7.30 నుంచి 11.30 గంటల వరకు పాఠశాలల నిర్వహణ.
ఏప్రిల్ 27వ తేదీ నుంచి 10వ తరగతి పరీక్షలు.
మే 6 వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు.
✍️ఉగాది తర్వాత*
*ఒంటిపూట బడులు!✍️📚*
*🌻ఆంధ్రజ్యోతి అమరావతి:* రాష్ట్రంలో ఒంటిపూట బడులు నిర్వహించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది.
దీనికి సంబంధించిన ఫైల్‌ను ప్రాథమిక విద్య డైరెక్టర్ సురేశ్‌కుమార్ ప్రభుత్వ ఆమోదం కోసం పంపించారు. ప్రభుత్వం ఓకే చెబితే ఉదయం 7.45 గంటల నుంచి 11.30 గంటల వరకు పాఠశాలలు జరుగుతాయి.
దీనిపై విద్యాశాఖ మంత్రి శుక్రవారం అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. శనివారం ఉగాది పండుగ, ఆ మరుసటి రోజు ఆదివారం కాబట్టి సోమవారం నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కావొచ్చు!


0 Response to "సోమవారం నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం"
Post a Comment