నేడు ఫ్యాప్టో రౌండ్‌టేబుల్‌ సమావేశం




 హాజరుకానున్న ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు 


అమరావతి, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): పీఆర్సీ ఉద్యమ కార్యాచరణపై నిర్ణయించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(ఫ్యాప్టో) రౌండ్‌టేబుల్‌ సమావేశం శనివారం జరగనుంది. ఈ సమావేశానికి ఫ్యాప్టోలోని టీచర్ల సంఘాలతో పాటు, ఇతర ఉద్యోగ సంఘాలు కూడా హాజరవుతాయని సమాచారం. విజయవాడలో సాయంత్రం 4గంటలకు ఈ సదస్సు నిర్వహించనున్నామని ఫ్యాప్టో అధ్యక్షుడు జోసెఫ్‌ సుధీర్‌బాబు శుక్రవారం తెలిపారు


*📚✍నల్ల బ్యాడ్జీలతో*

 *విధులకు ఉపాధ్యాయులు✍📚*


*♦పీఆర్సీ నష్టాన్ని సరిదిద్దాలని వినతులు*


*♦కార్యాచరణపై నేడు ఫ్యాప్టో సమావేశం*


*🌻ఈనాడు, అమరావతి*: ఉద్యోగ, ఉపాధ్యాయ, ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులు, పింఛన్‌దారులకు పీఆర్సీలో జరుగుతున్న నష్టాన్ని సరిదిద్దాలని కోరుతూ ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(ఫ్యాప్టో) ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్లు, డీఆర్వో, జేసీలకు శుక్రవారం ఉపాధ్యాయులు వినతిపత్రాలు సమర్పించారు. విజయవాడలో సబ్‌ కలెక్టర్‌కు ఫ్యాప్టో ఛైర్మన్‌ సుధీర్‌ బాబు, కో ఛైర్మన్‌ వెంకటేశ్వర్లు, కార్యవర్గ సభ్యుడు ప్రసాద్‌ వినతి పత్రం సమర్పించారు. ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. ఫిట్‌మెంట్‌ పెంచాలని, పీఆర్సీ నష్టాన్ని సరిదిద్దాలని నినాదాలు చేశారు. ‘‘చలో విజయవాడ కార్యక్రమంతో ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆందోళనను ప్రభుత్వం గుర్తించింది. మంత్రుల కమిటీతో జరిగిన చర్చల్లో ఉపాధ్యాయ సంఘాలు ప్రధానంగా 23శాతం ఫిట్‌మెంట్‌, జనవరి నుంచి గ్రాట్యుటీ అమలు, సీపీఎస్‌ తదితర అంశాలపై విభేదించాయి. వీటితోపాటు ఒప్పంద, పొరుగుసేవలు, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల క్రమబద్దీకరణపై మంత్రుల కమిటీ చర్యలు తీసుకోలేదు. రాష్ట్రంలో 13లక్షల ఉద్యోగులకు నష్టాన్ని కలిగిస్తోంది. దీనిపై సీఎం జగన్‌ పునఃసమీక్షించాలి’’ అని ఉపాధ్యాయులు విన్నవించారు. ఫిట్‌మెంట్‌ 27శాతం కంటే ఎక్కువ ఇవ్వాలని, గ్రాట్యూటీ ఏప్రిల్‌ 2020 నుంచి అమలు చేయాలని, సీపీఎస్‌ రద్దు, ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగుల క్రమబద్దీకరణ, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను గతేడాది అక్టోబరు 22నుంచి రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. విజయవాడలో శనివారం ఉద్యమ కార్యాచరణపై ఫ్యాప్టో ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించనున్నారు. భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించనున్నారు.


🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇


SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "నేడు ఫ్యాప్టో రౌండ్‌టేబుల్‌ సమావేశం"

Post a Comment