Padhe Bharat: పుస్తకాలపై ఆసక్తి కలిగించేందుకే ‘పఢే భారత్ క్యాంపైన్’: ధర్మేంద్ర ప్రధాన్
దిల్లీ: కొత్త ఏడాదిని పురస్కరించుకుని పాఠశాల విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. విద్యార్థులు పుస్తకాలను ఆసక్తిగా చదివేందుకు ‘పఢే భారత్ క్యాంపైన్’ను శనివారం ప్రారంభించింది. వరుసగా వంద రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు.
విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా వారి సృజనాత్మకత, ఆలోచనా తీరు, పదజాలం, మాట్లాడటం, రాయడం మెరుగుపడుతుందని ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. నిత్యం పుస్తకాలు చదవడం వల్ల వాటి ప్రాముఖ్యం తెలుస్తుందన్నారు. పుస్తక పఠనమనేది చక్కటి అలవాటని, మన భాషను మెరుగుపరుచుకునేందుకు ఇదో మంచి మార్గమని తెలిపారు. కేవలం జ్ఞానం పెంపొందించుకునేందుకే కాదు.. వ్యక్తిగతంగా మనల్ని మనం ఉత్తమంగా తీర్చుకునేందుకు పుస్తకం సాయపడుతుందన్నారు. పుస్తకాలు చదవడం వల్ల మనకొచ్చే ఆత్మసంతృప్తి వేరన్నారు. కాగా ఇప్పటికే సీబీఎస్‌ఈ పాఠశాలలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటూ శుక్రవారం ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది
0 Response to "Padhe Bharat: పుస్తకాలపై ఆసక్తి కలిగించేందుకే ‘పఢే భారత్ క్యాంపైన్’: ధర్మేంద్ర ప్రధాన్"
Post a Comment