నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకుని జనవరి 23 నుంచే గణతంత్ర వేడుకల
దిల్లీ: స్వాతంత్ర్య ఉద్యమకారుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్
జయంతిని పురస్కరించుకుని జనవరి 23నుంచే గణతంత్ర
వేడుకలను ప్రారంభించనున్నారని తెలుస్తోంది. ఏటా ఈ
ఉత్సవాలు జనవరి [24న మొదలవుతాయి. అయితే ప్రముఖ
వ్యక్తులకు ప్రాధాన్యం దక్కే విధంగా కేంద్రం ఈ విధంగా
మార్పులు చేర్పులు చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే
నేతాజీ జయంతిని పురస్కరించుకొని ఒకరోజు ముందు నుంచే
ఈ వేడుకలను ప్రారంభించనున్నట్లు ప్రభుత్వ వర్గాల
సమాచారం. ప్రభుత్వం నేతాజీ జయంతిని 'పరాక్రమ్ దివస్‌గా
జరుపుతున్న విషయం తెలిసిందే.
కరోనా వ్యాప్తి పెరుగుతున్న కారణంగా దిల్లీలో రిపబ్లిక్ డే
పరేడ్‌ను అతి కొద్దిమందితో నిర్వహించనున్నారు. సుమారు
౧,000 మందిని మాత్రమే అనుమతించనున్నట్లు తెలుస్తోంది.
ఇందులో 18వేల మంది ప్రత్యేక ఆహ్వానితులు కాగా.. మిగిలిన
5వేల మంది సాధారణ జనం హాజరుకానున్నారు. 2020
కొవిడ్‌కు ముందు ఈ ఉత్సవాలకు 1.25 లక్షల మందిని
అనుమతించగా.. 2021లో 25వేల మందికే పరిమితమైంది.
ఈసారి కూడా కొవిడ్ నిబంధనల నడుమ, భౌతిక దూరం
పాటిస్తూ ఉత్సవాలు జరగనున్నాయి
0 Response to "నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకుని జనవరి 23 నుంచే గణతంత్ర వేడుకల"
Post a Comment