2రోజుల్లో ఉద్యోగ సమస్యలు పరిష్కరించండి


అమరావతి, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఉన్న 13 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విశ్రాంత ఉద్యోగుల సమస్యలను ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి ఐక్యవేదిక పక్షాన సోమవారం నిర్వహించనున్న కార్యవర్గ సమావేశాలకు ముందే పరిష్కరించాలని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వరు... సీఎం జగన్‌కు విజ్ఞప్తి చేశారు. శనివారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. 11వ పీఆర్సీ, సీపీఎస్‌ రద్దు పెండింగ్‌ డీఏలు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ తదితర సమస్యలన్నీ పరిష్కరించాలని కోరారు. నూతన సంవత్సర కానుకగా ఉద్యోగుల సమస్యలను సీఎం పరిష్కరిస్తారని ఆశిస్తున్నామన్నారు. ఉద్యోగులు గత మూడు సంవత్సరాలుగా 11వ పీఆర్సీ కోసం ఎదురు చూస్తున్నారని గుర్తుచేశారు. హక్కు ప్రకారం రావాల్సిన, దాచుకున్న డబ్బులు కూడా  ప్రభుత్వం చెల్లించకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని బొప్పరాజు తెలిపారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "2రోజుల్లో ఉద్యోగ సమస్యలు పరిష్కరించండి"

Post a Comment