TS News: ఉద్యోగుల బదలాయింపు ప్రక్రియ వేగవంతం.. రేపట్నుంచి ఐచ్చికాలు

హైదరాబాద్‌: కొత్త జోనల్‌ విధానానికి అనుగుణంగా నెలాఖరులోగా ఉద్యోగుల బదలాయింపు ప్రక్రియ పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది

ఉద్యోగుల విభజన ప్రక్రియపై అన్ని శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ సమావేశమయ్యారు. ఉద్యోగుల సీనియారిటీ నిర్ధారణ, జిల్లాలకు కేటాయింపు తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. ఇందుకు సంబంధించి అమలు చేయాల్సిన కార్యాచరణపై చర్చించారు. ఎన్నికల ప్రవర్తనానియమావళి అమల్లో లేని జిల్లాల్లో తక్షణమే ప్రక్రియ ప్రారంభించాలని, రేపట్నుంచి ఐచ్చికాలు తీసుకోవాలని నిర్ణయించారు. ఉద్యోగుల బదలాయింపు ప్రక్రియపై ప్రతి జిల్లాకు ఒక సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిని నియమించనున్నారు.


ఉద్యోగుల విభజన ప్రక్రియలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని సీఎస్‌ను కోరామని ఈసందర్బంగా టీఎన్జీవో అధ్యక్షుడు మీడియాకు తెలిపారు. భార్యాభర్తలు ఒకే చోట పనిచేసేలా చూడాలని కోరినట్టు చెప్పారు. సీఎస్‌ ఇందుకు సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. జిల్లా కేడర్‌స్థాయి పోస్టులతో పాటే జోనల్‌ పోస్టుల విభజన ప్రక్రియ కూడా ప్రారంభమవుతుందని తెలిపారు. తెలంగాణలో కొత్త జోనల్‌ విధానం అమలులో భాగంగా ఉద్యోగులను స్థానికత ఆధారంగా సొంత జిల్లాలు, జోన్లు, బహుళ జోన్‌లకు బదలాయించేందుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు(జీవో నం.317) జారీ చేసిన విషయం తెలిసిందే


SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "TS News: ఉద్యోగుల బదలాయింపు ప్రక్రియ వేగవంతం.. రేపట్నుంచి ఐచ్చికాలు"

Post a Comment