APలో ఉద్యోగ సంఘాల ఉద్యమం ప్రారంభంDec
విజయవాడ: రాష్ట్రంలో ఉద్యోగ సంఘాలు మంగళవారం ఉదయం తమ ఉద్యమాన్ని ప్రారంభించారు. నల్లబ్యాడ్జీలతో ఉద్యోగులు నిరసన తెలుపుతున్నారు. పీఆర్సీ నివేదిక, ఉద్యోగుల సమస్యలపై ఈనెల 10 వరకు నల్లబ్యాడ్జీలతో ఉద్యోగులు నిరసన తెలుపనున్నారు. ఉమ్మడి జేఏసీలు తలపెట్టిన నిరసన కార్యక్రమానికి పలువురు ఉద్యోగులు మద్దతు తెలిపారు. ఉద్యోగులు స్వచ్ఛందగా ప్రభుత్వ కార్యాలయాలకు నల్ల బ్యాడ్జీలతో వచ్చి నిరసన తెలుపుతున్నారు. నిరసన కార్యక్రమంలో మహిళా ఉద్యోగులు కూడా పాల్గొన్నారు
0 Response to "APలో ఉద్యోగ సంఘాల ఉద్యమం ప్రారంభంDec"
Post a Comment