ప్రభుత్వ ఉద్యోగుల నిరసనలకు ఏపీఎస్ ఆర్టీసీ మద్దతు
ఈ మేరకు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావుకు సంఘం ప్రధాన కార్యదర్శి దామోదర్‌రావు లేఖ రాశారు. పీఆర్సీ అమలు, సీపీఎస్ రద్దు సహా ఇతర డిమాండ్ల పరిష్కారం కోసం ఉద్యోగ సంఘాల జేఏసీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చిందని లేఖలో పేర్కొన్నారు. జేఏసీ పిలుపు మేరకు ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళనలో పాల్గొంటారని ఈయూ నేతలు స్పష్టం చేశారు. మంగళవారం నుంచి దశల వారీగా జరిగే ఆందోళనలో ఆర్టీసీ ఉద్యోగులంతా పాల్గొంటారని తెలిపారు. ఆందోళన కార్యక్రమాల షెడ్యూల్‌ను ఆర్టీసీ ఎండీకి పంపినట్లు ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి దామోదరరావు లేఖలో పేర్కొన్నారు.
0 Response to "ప్రభుత్వ ఉద్యోగుల నిరసనలకు ఏపీఎస్ ఆర్టీసీ మద్దతు"
Post a Comment