✍పీఆర్‌సీ నివేదికనుప్రభుత్వం ఎందుకు ఇవ్వటం లేదు?✍📚* *♦యథావిధిగా నిరసనలు: ఉద్యోగ సంఘాల నేతలు
*📚✍పీఆర్‌సీ నివేదికనుప్రభుత్వం ఎందుకు ఇవ్వటం లేదు?✍📚*
*♦యథావిధిగా నిరసనలు: ఉద్యోగ సంఘాల నేతలు*
*🌻ఈనాడు, అమరావతి:* ‘పీఆర్‌సీ నివేదికను ఉద్యోగ సంఘాలకు ఇచ్చి దానిపై చర్చలకు పిలవాలనేది సంప్రదాయం. ఇప్పుడు నివేదిక ఇవ్వక పోగా.. కార్యదర్శుల కమిటీవద్దే సమాచారం లేదు. అందుకే పీఆర్‌సీతో పాటు ఉద్యోగుల 71 డిమాండ్ల పరిష్కారానికి ఈ నెల 7నుంచి ప్రకటించిన ఉద్యమ కార్యాచరణ యథావిధిగా కొనసాగుతుంది. ప్రాంతీయ సదస్సులను నిర్వహించి.. రెండో దశ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం’ అని ఉద్యోగ సంఘాల నేతలు ప్రకటించారు. పీఆర్‌సీ ప్రక్రియను 10 రోజుల్లో పూర్తిచేస్తామని సీఎం తిరుపతిలో చేసిన ప్రకటన నేపథ్యంలో కార్యదర్శుల కమిటీ సమావేశంలో నివేదిక ఇస్తారన్న ఆశతో వెళితే నిరాశే ఎదురైందన్నారు.పీఆర్‌సీపై సచివాలయంలో శుక్రవారం జరిగిన కార్యదర్శుల కమిటీ సమావేశంలో పాల్గొన్న అనంతరం ఉద్యోగ సంఘాల నేతలు వేర్వేరుగా విలేకరులతో మాట్లాడారు.
*♦ఉద్యమం కొనసాగిస్తాం: బొప్పరాజు వెంకటేశ్వర్లు*
‘పీఆర్‌సీ రిపోర్టు ఇవ్వాలని జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో గట్టిగా డిమాండ్ చేశాం. అన్ని సంఘాలూ అందుకే పట్టుపట్టాయి. పీఆర్‌సీ నివేదికను ఉద్యోగ సంఘాలకు ఇచ్చేలా సీఎం జోక్యం చేసుకోవాలి. ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి హామీ రాలేదు. అందుకే ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఈ నెల 7 నుంచి నిరసన ప్రదర్శనల్లో పాల్గొనాలి. ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తూ.. ఉద్యోగులను మాత్రం సంక్షోభంలోకి నెట్టింది. మాకు రావాల్సిన రూ.1,600 కోట్ల బకాయిల గురించి ప్రభుత్వం పట్టించుకోలేదు. విధిలేని పరిస్థితుల్లోనే ఉద్యమంలోకి వెళ్తున్నాం’ అని ఏపీ ఐకాస అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.
* ‘నివేదిక ఇవ్వకుండా పీఆర్‌సీ ప్రకటిస్తే అంగీకారం కాదు. పీఆర్‌సీ అంటే ఫిట్‌మెంట్ ఒక్కటే కాదు. పే స్కేళ్లు, ఇంక్రిమెంట్లు తదితర అంశాలపై కమిటీ నివేదికలో ఏం చెప్పిందనేది తెలియకుండా ఎలా చర్చిస్తాం?’ అని ఏపీ ఉద్యోగ సంఘాల జేఏసీ ఛైర్మన్ బండి శ్రీనివాసరావు ప్రశ్నించారు.
* ‘ప్రభుత్వం నిర్వహించిన కార్యదర్శుల కమిటీ సమావేశంలో ఛైర్మన్, కార్యదర్శి లేరు. ఈ రోజు జరిగింది జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం కాదు. ఇందులో చర్చ ఏమీ జరగలేదు. జనవరి వరకు వేచి చూసి మా కార్యచరణను మేం ప్రకటిస్తాం’ అని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ తెలిపారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
0 Response to "✍పీఆర్‌సీ నివేదికనుప్రభుత్వం ఎందుకు ఇవ్వటం లేదు?✍📚* *♦యథావిధిగా నిరసనలు: ఉద్యోగ సంఘాల నేతలు"
Post a Comment