ఉద్యోగులు కోరే 45 శాతం సాధ్యం కాదు: సజ్జల
అమరావతి: ఉద్యోగ సంఘాల నేతలు సీఎం జగన్‌తోనూ చర్చించే అవకాశం ఉందని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. ఉద్యోగులకు ఇప్పటికే 27 శాతం ఐఆర్ ఇస్తున్నామని చెప్పారు. 14.29 శాతం ఫిట్‌మెంట్ వల్ల ఉద్యోగులకు నష్టం ఉండదన్నారు. ఉద్యోగులు కోరే 45 శాతం సాధ్యం కాదని కమిటీ చెప్పిందని సజ్జల గుర్తు చేశారు. ‘‘సీఎస్ కమిటీ సిఫారసు చేసిన ఫిట్‌మెంట్‌ను పెంచే అవకాశం ఉంది. ప్రస్తుత పీఆర్‌సీ అమలుకు ఏడెనిమిది ఏళ్లు పడుతోంది. సెంట్రల్ పే కమిషన్ ప్రకారం పదేళ్లకు ఒకసారి ఇచ్చినా నష్టం ఉండదు. సీపీఎస్ రద్దుపై సీఎం జగన్ స్వయంగా హామీ ఇచ్చారు’’ అని సజ్జల తెలిపారు
0 Response to "ఉద్యోగులు కోరే 45 శాతం సాధ్యం కాదు: సజ్జల"
Post a Comment