ఈనాడు, అమరావతి: ‘రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయంలో 111శాతం జీతాలు, పింఛన్లకే ఖర్చవుతుందంటే ఎవరైనా నమ్ముతారా? రాష్ట్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టే బడ్జెట్‌లో ఈ విషయం ఎందుకు ప్రస్తావించలేదు?’ అని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఒక ప్రకటనలో ప్రశ్నించారు. ‘ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పింఛన్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చెబుతున్న లెక్కలు నమ్మశక్యంగా లేవు. ఈ తప్పుడు లెక్కల నివేదికను ఎవరిని మోసపుచ్చడానికి తయారుచేయించారు? ప్రజలకు, ప్రభుత్వ ఉద్యోగులకు మధ్య దూరం పెంచేందుకే ఇలా చేస్తున్నారు..’ అని ఆయన ధ్వజమెత్తారు. జీతాలు, పింఛన్లకు నెలకయ్యే ఖర్చు రూ.4,600 కోట్లేనని ఉద్యోగ సంఘాలు చెబుతూనే ఉన్నాయని.. అప్పుడే ప్రభుత్వ ఉన్నతాధికారులు ఎందుకు ఖండించలేదని ఆయన ప్రశ్నించారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు కేంద్రమిచ్చే నిధులే మళ్లిస్తున్నారని ఆరోపించారు
0 Response to "రాబడిలో 111శాతం జీతాలు, పింఛన్లకేనా? ఎవరైనా నమ్ముతారా?: జనసేన నేత నాదెండ్ల"
Post a Comment