చిన్నారులను అతిథుల్లా ఆహ్వానించండి’
చెన్నై: నవంబర్ ఒకటి నుంచి పాఠశాలలకు వస్తున్న బాలబాలికలను అతిథుల్లా భావించి ఆహ్వానం పలకాలని ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రతినిధులకు ముఖ్యమంత్రి స్టాలిన్ పిలుపునిచ్చారు. ఒకటి నుంచి ఎనిమిది తరగతుల విద్యార్థులకు నవంబర్ ఒకటిన పాఠశాలలను పునఃప్రారంభమవుతున్న సందర్భంగా ఆయన శనివారం ఓ సందేశం వెలువరించారు. పాఠశాలలకు గంతులేసుకుంటూ, ఉరకలేస్తూ రానున్న చిన్నారులను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నానని తెలిపారు. నవంబర్ ఒకటిన మళ్ళీ పాఠశాలలకు వస్తున్న బాలబాలికలను స్నేహపూర్వకంగా ఆహ్వానిద్దాం. విద్యలో ఉన్నతస్థితికి చేరుకోవాలని ఆశిద్దాం, గతాన్ని మరచి, భవిష్యత్‌లో అంతా మంచే జరుగుతుందని ఆశిద్దాం అంటూ ఆయన సందేశమిచ్చారు. పాఠశాలలకు వచ్చే చిన్నారులను ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రతినిధులు ఆహ్వానించాలని ఆయన విజ్ఞప్తి చేశారు

0 Response to "చిన్నారులను అతిథుల్లా ఆహ్వానించండి’"
Post a Comment