నవంబర్ 1న వైఎస్సార్ జీవిత సాఫల్య పురస్కారాలు ప్రదానం 25 Oct, 2021 08:20 IST
మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన విశిష్ట వ్యక్తులకు ప్రకటించిన వైఎస్సార్ జీవిత సాఫల్య పురస్కారాలను నవంబర్ 1న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రదానం చేస్తారు. విజయవాడలోని ఏ–1 కన్వెన్షన్ హాల్‌లో జరిగే ఈ కార్యక్రమం ఏర్పాట్లను ముఖ్యమంత్రి కార్యదర్శి రేవు ముత్యాలరాజు, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం, కలెక్టర్ జె.నివాస్ తదితరులు ఆదివారం సాయంత్రం పరిశీలించారు. వ్యవసాయం, కళలు, సంస్కృతి, సాహిత్యం మొదలైన రంగాల్లో అసమాన ప్రతిభ చాటిన 62 మందికి ఈ అవార్డులను అందచేయనున్నారు. వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో పాటు రూ.10 లక్షల నగదు అందచేయనున్నారు
0 Response to "నవంబర్ 1న వైఎస్సార్ జీవిత సాఫల్య పురస్కారాలు ప్రదానం 25 Oct, 2021 08:20 IST"
Post a Comment