Fake Vaccines: నకిలీ టీకాలను గుర్తించడం ఎలాగంటే..! రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ సూచనలు
దిల్లీ: కరోనా వైరస్ మహమ్మారిని నిరోధించే వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకున్నాయి. పంపిణీ ప్రక్రియను కూడా ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి.
ఇదే సమయంలో నకిలీ టీకాలు మార్కెట్‌లోకి ప్రవేశిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇలాంటి నకిలీ టీకాలపై ప్రపంచ ఆరోగ్యసంస్థ కూడా ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో దేశంలో నకిలీ టీకాలపై అప్రమత్తంగా ఉండాలన్న కేంద్ర ప్రభుత్వం.. ప్రస్తుతం వినియోగిస్తోన్న వ్యాక్సిన్‌ల ప్రామాణికతపై రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది.
కొవిషీల్డ్‌కు చెందిన నకిలీ టీకాలు ఆసియా, ఆఫ్రికా మార్కెట్లోకి వచ్చినట్లు వార్తలు వచ్చాయి. వీటితో పాటు దేశంలోనూ పలుచోట్ల ఇటువంటి టీకాలు వాడుకలో ఉన్నాయనే అనుమానాలు వ్యక్తం చేస్తూ మీడియాలో కథనాలు వెలుబడ్డాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి వాటిపై దర్యాప్తును ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం.. ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది. కరోనా వ్యాక్సిన్ అసలైనదా? నకిలీదా అనే విషయాన్ని సులువుగా తెలుసుకునేందుకు రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది. ప్రస్తుతం దేశంలో వినియోగిస్తోన్న కొవిషీల్డ్, కొవాగ్జిన్, స్పుత్నిక్-వి టీకాల తయారీ సంస్థలకు సంబంధించి.. ఆయా బాటిళ్లపై లేబుల్, రంగుతో పాటు తయారీ సంస్థల సమాచారం గురించిన వివరాలను తెలియజేస్తూ రాష్ట్రాలకు లేఖ రాసింది
0 Response to "Fake Vaccines: నకిలీ టీకాలను గుర్తించడం ఎలాగంటే..! రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ సూచనలు"
Post a Comment