ఉపాధ్యాయులు, విద్యార్థులకు ప్రత్యేక యాప్‌

: ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫిట్జీ గ్లోబల్‌ స్కూల్‌ దేశంలోని విద్యార్థులు, ఉపాధ్యాయుల కోసం ‘హలో టీచర్‌’ అనే ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. తమ విద్యార్థుల జీవితాల్లో శాశ్వతంగా ప్రభావం చూపేలా ఉపాధ్యాయుల కోసం ఈ యాప్‌ రూపొందించబడింది. ప్రముఖ తమిళ పత్రిక జాయింట్‌ డైరెక్టర్‌ లక్ష్మీపతి ఇటీవల వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా దీనిని లాంఛనంగా ఆవిష్కరించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు దీనిని ప్లే స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఉపాధ్యాయులు యాప్‌లో అసైన్‌మెంట్‌ను పోస్ట్‌ చేసినప్పుడు, దానిని బయటకు ఫార్వర్డ్‌ చేయలేరు. విద్యార్థుల స్పందనను ఇతరులు చూడలేరని నిర్వాహకులు పేర్కొన్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఉపాధ్యాయులు, విద్యార్థులకు ప్రత్యేక యాప్‌"

Post a Comment