N.E.P -2020 తెలుగులో...
N.E.P -2020 తెలుగులో...
సంపూర్ణ మానవ సామర్ధ్యాన్ని సాధించేందుకు, నిష్పాక్షికమైన, న్యాయబద్ధమైన సమాజాన్ని స్థాపించేందుకు,
జాతీయ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లేందుకు విద్యే మౌలికమైనది. భారతదేశ నిరంతర ప్రగతికి; అలాగే
ఆర్థికాభివృద్ధి, సామాజిక న్యాయం, సమానత్వం, వైజ్ఞానిక ఉన్నతి, జాతీయ సమైక్యత, సంస్కృతి పరిరక్షణల రీత్యా
ప్రపంచ వేదిక మీద నాయకత్వం వహించేందుకు గాను నాణ్యమైన విద్య అందరికీ అందుబాటులో వుండేలా చూడటం
చాలా ముఖ్యమైన అంశం. వ్యక్తి, సమాజ, దేశ, ప్రపంచ శ్రేయస్సు కోసం మన దేశ సుసంపన్న సామర్ధ్యాలను,
వనరులను అభివృద్ధిపరచుకుంటూ ముందుకువెళ్లేందుకు విశ్వజనీన, సర్వశ్రేష్ట విద్యే ఉత్తమమైన మార్గం. వచ్చే
దశాబ్దం నాటికి భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక యువజన జనాభా వున్న దేశంగా మారుతుంది. వారికి అత్యంత
నాణ్యమైన విద్యావకాశాలు కల్పించడం మన దేశ భవిష్యత్తును నిర్దేశిస్తుంది.
నిరంతర అభివృద్ధి కోసం భారతదేశం 2015లో రూపొందించుకున్న 2030 ఎజెండా లక్ష్యం-4 (ఎస్‌డిజి[శలో ప్రపంచ
విద్యాభివృద్ధి ఎజెండా ప్రతిబింబించింది. 2030 నాటికి సమ్మిళిత, నిష్పాక్షిక నాణ్యమైన విద్యను అందుబాటులోకి
తీసుకురావడం, అందరికీ జీవితపర్యంతం నేర్చుకునే అవకాశాలను కల్పించడం దీని ఉద్దేశం. నేర్చుకోవడానికి
మద్దతును, ప్రోత్సాహాన్ని అందించే మహత్తరమైన ధ్యేయాన్ని సాధించేందుకు గాను మొత్తం విద్యా వ్యవస్థను
పునర్వ్యవస్థీకరించాలి. తద్వారా 2030 ఎజెండాలోని సంక్లిష్టమైన టార్గెట్లను, లక్ష్యాలను, నిలకడతో కూడిన అభివృద్ధి
లక్ష్యాలను (సస్టైనబుల్ డెవెలప్మెంట్ గోల్స్- ఎస్ డి జి ) సాధించవచ్చు.
జ్ఞానంలో ప్రపంచమంతా వేగంగా మార్పులకు గురవుతోంది. బిగ్ డాటా, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్
వంటి రంగాలలో వస్తున్న ప్రగతి కారణంగా ప్రపంచవ్యాప్తంగా అంతగా నైపుణ్యం అవసరం లేని ఉద్యోగాలను అనేక
యంత్రాలే నిర్వహించవచ్చు. అయితే ప్రత్యేకించి గణితం, కంప్యూటర్ సైన్స్, డాటా సైన్స్ ల విషయంలో మాత్రం విజ్ఞాన
శాస్తాలు, సామాజిక శాస్త్రాలు, మానవీయ శాస్త్రాలు బహుశాస్త్ర విషయ సామర్ఞ్యా లతో కలగలసి నైపుణ్యంతో కూడిన
ఉద్యోగాల ఆవశ్యకత చాలా పెరుగుతోంది. వాతావరణ మార్పు, పెరుగుతున్న కాలుష్యం, తరుగుతున్న ప్రకృతి
వనరుల కారణంగా ప్రపంచ ఇంధన, నీటి, ఆహార, పారిశుధ్య అవసరాలను ఎలా తీర్చాలి అనే విషయంలో
గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తత్ఫలితంగా కూడా ముఖ్యంగా జీవశాస్త్రం, రసాయన శాస్త్రం,
భౌతికశాస్త్రం, వ్యవసాయం, వాతావరణ విజ్ఞానం, సామాజిక శాస్త్రం రంగాలలో నూతన నైపుణ్యంతో కూడిన శ్రామిక శక్తి
అవసరం ఎక్కువవుతోంది. అంటువ్యాధులు, మహమ్మారులు ప్రబలిపోతున్నందు వల్ల అంటువ్యాధుల
యాజమాన్యం విషయంలో పరస్పర సహకారంతో కూడిన పరిశోధనలు, రోగనిరోధక టీకాలు, పెరుగుతున్న
సామాజిక సమస్యలు మొదలైనవాటి కారణంగా బహుశాస్త్ర విషయాలతో కూడిన విద్య ఆవశ్యకత ఎక్కువవుతోంది.
భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా, ప్రపంచంలోని మూడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఎదుగుతున్న
క్రమంలో మానవ విజ్ఞాన శాస్త్రాలకు, కళలకు ఎంతో డిమాండ్ ఏర్పడుతోంది.
నిజానికి వేగంగా మారుతున్న ఉపాధి రంగం, ప్రపంచ జీవావరణ వ్యవస్థల వల్ల పిల్లలు కేవలం నేర్చుకుంటే సరిపోదు,
ఎలా నేర్చుకోవాలో అనే దానిని కూడా నేర్చుకోవాల్సి వుంటుందనేది అంతకంతకూ స్పష్టమవుతోంది. అందువల్ల
విద్య తక్కువ కంటెంట్‌తో, తార్కికంగా ఎలా ఆలోచించాలి, సమస్యలను ఎలా పరిష్కరించాలి, సృజనాత్మకంగా ఎలా
వుండాలి, బహుశాస్త్ర విషయాలను ఎలా అలవర్చుకోవాలి, పరిశోధనాత్మకంగా ఎలా వుండాలి, మారుతున్న
రంగాలలో నూతన వస్తువును ఎలా అవగాహన చేసుకోవాలి, ఎలా అలవర్చుకోవాలి అనే దిశలో ఎక్కువగా
ముందుకు సాగాలి. బోధనాశాస్త్రం విద్యను మరింత అనుభవసహితంగా, సమగ్రంగా, సంఘటితంగా, జిజ్ఞాసను
రేకెత్తించేదిగా, శోధనాత్మకంగా, నేర్చుకునే వ్యక్తి కేంద్రంగా, చర్చలపై ఆధారపడేదిగా, సులభమయ్యేదిగా అదే
0 Response to "N.E.P -2020 తెలుగులో..."
Post a Comment