వచ్చేస్తోంది ఈ-రూపాయి
నేడు లాంఛనంగా ప్రారంభించనున్న ప్రధాని
మొబైల్ ఫోన్‌కు ఈ-రూపీ క్యూఆర్ కోడ్
లేదా ఎస్సెమ్మెస్ రూపంలో స్ట్రింగ్ వోచర్
ముందుగా వోచర్లు కొనుగోలు చేయాలి
వాటిని ఉద్దేశించిన సేవలకే వినియోగించాలి
భారత జాతీయ చెల్లింపుల సంస్థ చొరవ
పలు కేంద్ర శాఖల సహకారంతో రూపకల్పన
ప్రస్తుతం 8 బ్యాంకుల ద్వారా సేవలు
కేంద్ర ప్రభుత్వ పథకాలకు వర్తించేలా చర్యలు
న్యూఢిల్లీ, ఆగస్టు 1: ఎలకా్ట్రనిక్ రూపంలో ఉండే రూపాయి.. ‘ఈ-రూపీ’ సోమవారం నుంచి అందుబాటులోకి రానుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దీన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. బ్యాంకు ఖాతాలు, కార్డులు, యాప్‌లతో సంబంధం లేకుండా.. నగదు రహిత, కాంటాక్ట్‌లెస్ లావాదేవీలకు ఈ విధానం ఉపయోగపడుతుంది. ఇ-రూపీని ఏ ఉద్దేశంతో తీసుకుంటారో.. అదే ఉద్దేశానికి మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇతర చెల్లింపులకు అది పనికిరాదు. అంటే ప్రభుత్వం సబ్సిడీల రూపం లో నగదును అందజేస్తున్న పలుపథకాలను క్రమంగా ఇ-రూపీ పరిధిలోకి తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని ద్వారా వృథా, దుర్వినియోగాన్ని అరికట్టవచ్చనేది కేంద్రం అభిప్రాయంగా తెలుస్తోంది. ఉదాహరణకు ఎరువుల డీలర్లు ప్రభుత్వ సబ్సిడీని తగ్గించి, బస్తాలను రైతులకు విక్రయిస్తున్నారు. ఇకపై ఆ సబ్సిడీని నేరుగా రైతుల మొబైల్ ఫోన్లకు ఈ-రూపీ వోచర్ల రూపంలో పంపే అవకాశాలున్నాయి. వారు ఎరువుల డీలర్ల వద్ద వాటిని రిడీమ్ చేసుకుని, మిగతా మొత్తం నేరుగా లేదా ఈ-రూపీ వోచర్లను కొనుగోలు చేసి, చెల్లించొచ్చు
ఈ-రూపీ అంటే..
ఈ-రూపీ అనేది వినియోగదారుల మొబైల్‌ఫోన్‌కు క్యూఆర్ కోడ్ లేదా ఎస్సెమ్మెస్ స్ట్రింగ్ వోచర్ రూపంలో చేరుతుంది. ఈ-రూపీ అనేది ఎలాంటి ప్లాట్‌ఫాం కాదు. థర్డ్ పార్టీ పేమెంట్ గేట్‌వే ప్రమేయం ఇందులో ఉండదు. ఈ కోడ్/వోచర్‌ను లబ్ధిదారులు ఎలాంటి కార్డులు, నెట్‌బ్యాంకింగ్, డిజిటల్ పేమెంట్ యాప్‌తో సంబంధం లేకుండా నగదుకు బదులుగా వినియోగించుకోవొచ్చు. భారత జాతీయ చెల్లింపుల సాధికార సంస్థ(ఎన్‌పీసీఐ) రూపకల్పన చేసిన ఈ-రూపీలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆరోగ్య శాఖ, జాతీయ ఆరోగ్య సాధికార సంస్థ సహకారం ఉంది. క్యూఆర్ కోడ్ లేదా ఎస్సెమ్మె్‌సలో వచ్చే స్ట్రింగ్ వోచర్‌ను సంబంధిత వాణిజ్య, వ్యాపార సంస్థల వద్ద రిడీమ్ చేసుకోవచ్చు. ఉదాహరణకు కొవిడ్ టీకా కోసం ప్రైవేటు ఆస్పత్రిలో చెల్లింపులకు ఈ విధానం ఉపయోగపడుతుంది. టీకా కోసం ఈ-రూపీని తీసుకుంటే వ్యాక్సిన్ కోసం మాత్రమే రిడీమ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్య సంబంధిత మందులు, మాతాశిశు సంరక్షణ పథకం, టీబీ కార్యక్రమంలో డయాగ్నస్టిక్/మందులు, ఎరువుల కొనుగోళ్లకు సంబంధించి ఇప్పుడు నగదు/నగదు బదిలీ రూపంలో సబ్సిడీ ఇస్తున్నారు. వీటికి తొలిదశలో ఈ-రూపీని వినియోగించే అవకాశాలున్నాయి.
కార్పొరేట్ సంస్థలు కూడా..
కార్పొరేట్ సంస్థలు తమ ఉద్యోగుల సంక్షేమానికి, కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా ఈ-రూపీ వోచర్లను జారీ చేయవచ్చని కేంద్రం పేర్కొంది. ముఖ్యంగా వ్యాక్సినేషన్‌కు సంబంధించి ఆయా సంస్థలు తమ ఉద్యోగులకు ఈ-రూపీని గిఫ్ట్‌గా ఇవ్వొచ్చని తెలిపింది. అలా ఈ-రూపీని బహుమతిగా ఇచ్చిన వారు.. వోచర్ల వినియోగాన్ని ట్రాక్ చేయవచ్చు. ఇప్పటికే ఎస్‌బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, హెచ్‌డీఎ్‌ఫసీ, యాక్సిస్, ఐసీఐసీఐ బ్యాంక్ ఎన్‌పీసీఐతో ఈ-రూపీ కోసం ఎన్‌పీసీఐతో ఒప్పందం కుదర్చుకున్నాయి
0 Response to " వచ్చేస్తోంది ఈ-రూపాయి"
Post a Comment