అందరూ ఉత్తీర్ణులే పదో తరగతి ఫలితాలను విడుదల చేసిన మంత్రి సురేష్ గతేడాది 6.24 లక్షల మంది, 2019-20లో 6.29 లక్షల మంది పాస్ అంతర్గత పరీక్షల ఆధారంగా గ్రేడ్లు, గ్రేడ్‌పాయింట్లు కేటాయింపు
ఈనాడు, అమరావతి: గతేడాది పదో తరగతి పరీక్షలకు రుసుము చెల్లించిన విద్యార్థులందరూ ఉత్తీర్ణులైనట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. పలు ఉద్యోగాలు, ప్రవేశాలకు పది మార్కులు అవసరమవుతున్నాయని విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి వచ్చిన వినతుల మేరకు అంతర్గత పరీక్షల ఆధారంగా గ్రేడ్లు, గ్రేడ్ పాయింట్లు కేటాయించినట్లు వెల్లడించారు. విజయవాడలో శుక్రవారం 2019-20, 2020-21 విద్యా సంవత్సరాల పదోతరగతి పరీక్షల ఫలితాలను ఆయన విడుదల చేశారు. 2020-21లో 6,24,367 మంది పదో తరగతి పరీక్షలకు రుసుము చెల్లించగా.. వీరిలో బాలురు 3,21,555, బాలికలు 3,02,812 మంది ఉన్నారు. 2019-20లో 6,29,545 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో బాలురు 3,22,155, బాలికలు 3,07,390 మంది. కరోనా కారణంగా 2019-20 విద్యా సంవత్సరానికి పది పరీక్షలను రద్దు చేశారు. వీరికి ఎలాంటి మార్కులు ఇవ్వకుండా కేవలం ఉత్తీర్ణులైనట్లు మార్కుల జాబితా ఇచ్చారు. గ్రేడ్లు, గ్రేడ్‌పాయింట్లు ఇవ్వకపోవడంతో ఉద్యోగాలు, పై చదువులకు ఇబ్బందులు వస్తున్నందున 2020-21 విద్యా సంవత్సరంతోపాటు 2019-20లో పదో తరగతి చదివిన విద్యార్థులకూ గ్రేడ్లు, గ్రేడ్‌పాయింట్లు కేటాయిస్తూ తాజాగా ఫలితాలను విడుదల చేశారు.
మార్కుల మదింపు ఇలా..
* 2019-20 విద్యార్థులకు ఆ విద్యా సంవత్సరంలో నిర్వహించిన మూడు ఫార్మెటివ్ పరీక్షలకు 50 శాతం, సమ్మెటివ్-1 పరీక్షకు 50 శాతం వెయిటేజీతో గ్రేడ్లు, గ్రేడ్ పాయింట్లు ఇచ్చారు. 50 మార్కుల చొప్పున మూడు ఫార్మెటివ్‌లు నిర్వహించగా.. వంద మార్కులకు సమ్మెటివ్-1 నిర్వహించారు.
* 2020-21 విద్యార్థులకు ఫార్మెటివ్‌లో రాత పరీక్ష (స్లిప్ టెస్ట్)కు 70 శాతం, తరగతిలో పిల్లల భాగస్వామ్యం, ప్రాజెక్టు వర్క్స్, రాతపుస్తకాల వర్క్‌కు 30 శాతం వెయిటేజీతో గ్రేడ్లు కేటాయించారు. ఫార్మెటివ్ 50 మార్కుల్లో రాత పరీక్ష 20 మార్కులు, తరగతిలో పిల్లల భాగస్వామ్యం, ప్రాజెక్టు వర్క్స్, నోటుపుస్తకాల వర్క్‌కు పదేసి చొప్పున 30 మార్కులు ఉంటాయి.
*గతంలో అనుత్తీర్ణులై 2019-20, 2020-21కు పరీక్ష రుసుము చెల్లించిన వారికి అంతర్గత మార్కులు 20ను వంద శాతానికి పెంచి, గ్రేడ్లు, గ్రేడ్‌పాయింట్లు ఇచ్చారు. 2018-19 వరకు పదో తరగతిలో రాతపరీక్షకు 80, అంతర్గత మార్కులు 20 ఉండేవి. దీన్ని అనుసరించి 20 అంతర్గత మార్కుల్లో విద్యార్థికి వచ్చిన మార్కులను 5తో గుణించి గ్రేడ్లు కేటాయించారు
పాఠశాలలకు షార్ట్ మెమోలు
షార్ట్ మెమో, మైగ్రేషన్ ధ్రువపత్రాలను ప్రభుత్వ పరీక్షల విభాగం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. వీటిని పాఠశాలల వారీగా ప్రధానోపాధ్యాయులు డౌన్‌లోడ్ చేసుకొని, విద్యార్థులకు అందించాల్సి ఉంటుంది. ఒరిజినల్ ఉత్తీర్ణత ధ్రువపత్రాలను త్వరలో పాఠశాలలకు పంపించనున్నారు. వీటిపై ప్రధానోపాధ్యాయులు సంతకాలు చేసి, పిల్లలకు అందిస్తారు
0 Response to "అందరూ ఉత్తీర్ణులే పదో తరగతి ఫలితాలను విడుదల చేసిన మంత్రి సురేష్ గతేడాది 6.24 లక్షల మంది, 2019-20లో 6.29 లక్షల మంది పాస్ అంతర్గత పరీక్షల ఆధారంగా గ్రేడ్లు, గ్రేడ్‌పాయింట్లు కేటాయింపు"
Post a Comment