✍4వేల కోట్లతో నాడు-* *నేడు రెండోదశ

*📚✍4వేల కోట్లతో నాడు-*
 *నేడు రెండోదశ✍📚*

*♦పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు వ్యయం* 

*♦ఎన్ఎస్ఈపీపై ప్రజాప్రతినిధులకు అవగాహన సదస్సులు*

 *🌻అమరావతి, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి):* నూతన విద్యావిధానంపై ప్రాంతాల వారీగా ప్రజా ప్రతినిధులకు అవగా హన సదస్సులు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. తెలుగు విద్యార్థులు ప్రపంచ వ్యాప్తంగా పోటీపడేలా తీర్చిదిద్దడమే నూతన విద్యావి ధానం లక్ష్యమన్నారు. విద్యా సంస్కరణలపై మంగళవారం సచివాలయంలో నిర్వహించిన సదస్సులో మంత్రి మాట్లా డుతూ... నాడు-నేడు రెండోదశలో రూ.4వేల కోట్లతో పాఠశా లల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఏపీలో అమలవు తున్న కార్యక్రమాల వివరాలు తెలుసుకుని తెలంగాణ ప్రభుత్వం కూడా అమలు చేస్తోందన్నారు. మంత్రి వేణుగో పాలకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో నూతన విద్యావిధానం అమలును సీఎం జగన్ 16న ప్రారంభిస్తారన్నారు. నూతన విద్యావిధానంపై పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "✍4వేల కోట్లతో నాడు-* *నేడు రెండోదశ"

Post a Comment