16న స్కూళ్లు పునఃప్రారంభం

ఆంధ్ర రాష్ట్రంలో ఆగస్ట్‌ 16న స్కూళ్లు పునఃప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. అదే రోజు జగనన్న విద్యా కానుక పంపిణీ చేస్తామని చెప్పారు. విద్యా కానుకలో









 ఈసారి డిక్షనరీ ఇస్తున్నామన్నారు. జగనన్న విద్యా దీవెన రెండో విడత సొమ్ము విడుదల కార్యక్రమం అనంతరం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.

మొదటి దశలో నాడు–నేడు కింద అభివృద్ధి చేసిన 15 వేల స్కూళ్లను 16వ తేదీన ప్రజలకు అంకితం చేస్తామని పేర్కొన్నారు. అదే రోజు రెండో విడత నాడు – నేడు పనులను కూడా ప్రారంభించనున్నట్లు తెలిపారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "16న స్కూళ్లు పునఃప్రారంభం "

Post a Comment