ఈపీఎఫ్‌పై 8.5 శాతం వడ్డీ రేటు
- 2020-21కి ఈపీఎఫ్‌ఓ నిర్ణయం
- ఐదు కోట్ల మందికి ప్రయోజనం
- కేంద్ర కార్మిక మంత్రి సంతోష్ గంగ్వార్ ఆధ్వర్యంలో బోర్డు సమావేశం
న్యూఢిల్లీ, మార్చి4: ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎఫ్) డిపాజిట్లపై ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 8.50ు వార్షిక వడ్డీ రేటును కొనసాగించాలని ఈపీఎ్‌ఫవో నిర్ణయించింది. దీంతో 5 కోట్లకు పైగా ఖాతాదారులకు ప్రయోజనం కలగనుంది. శ్రీనగర్‌లో గురువారం కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈపీఎ్‌ఫవో కేంద్ర ధర్మకర్తల బోర్డు(సీబీటీ) 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఈ వడ్డీ రేటును నిర్ణయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సీబీటీ 8.50ు వార్షిక వడ్డీ రేటును సిఫారసు చేసిందని, దీన్ని సభ్యుల ఖాతాల్లో జమ చేస్తామని కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా, వడ్డీ రేటుపై సీబీటీ నిర్ణయాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ సమ్మతి కోసం పంపుతారు. ఆమోదం తర్వాత 8.50ు వడ్డీ రేటును ఈపీఎ్‌ఫవో చందాదారుల ఖాతాల్లో జమ చేస్తారు.
వడ్డీ రేటును ప్రభుత్వ గెజిట్‌లో నోటిఫై చేస్తారని, ఆ తర్వాత ఈపీఎ్‌ఫవో వడ్డీ రేటును ఖాతాల్లో జమ చేస్తుందని కార్మికశాఖ పేర్కొంది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి పీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ రేటును ఏడేళ్ల కనిష్ఠ స్థాయిలో 8.5 శాతానికి తగ్గించారు. కాగా, 2020-21లో ఈక్విటీ పెట్టుబడులను నగదులోకి మార్చుకోవాలని ఈపీఎ్‌ఫవో నిర్ణయించింది. డెట్ పెట్టుబడుల ద్వారా సమకూరే వడ్డీ రాబడి, ఈక్విటీ పెట్టుబడుల నుంచి లభించే ఆదాయం ఆధారంగా ఈసారి పీఎఫ్ చందాదారులకు వడ్డీ రేటును ప్రతిపాదించారు. మరోవైపు ఈపీఎ్‌ఫవో రూ.300 కోట్ల మిగులు నిధులు కలిగి ఉండే అవకాశం ఉందని ఈపీఎ్‌ఫవో ట్రస్టీ కేఈ రఘునాథన్ పేర్కొన్నారు.
0 Response to "ఈపీఎఫ్‌పై 8.5 శాతం వడ్డీ రేటు"
Post a Comment