ఇద్దరు తెలుగు బాలలకు.. రాష్ట్రీయ బాల పురస్కార్
న్యూఢిల్లీ, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు బాలలకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రీయ బాల పురస్కార్‌ను ప్రకటించింది. కళలు, సంస్కృతి విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అమేయ లగుడు, ఆవిష్కరణల విభాగంలో తెలంగాణకు చెందిన హేమేశ్ చదలవాడకు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ - 2021 లభించింది. వివిధ విభాగాల్లో ప్రతిభ కనబర్చిన 32 మంది బాలలు ఈ అవార్డుకు ఎంపికయ్యారు. వీరితో మోదీ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషిస్తారు.
14 ఏళ్లకే టెక్ నిపుణుడిగా మారి..
హైదరాబాద్‌కు చెందిన 14 ఏళ్ల హేమేశ్ చదలవాడ తన సాంకేతిక సృజనతో భళా అనిపించారు. చిన్న వయసులోనే వెబ్ డెవలపర్‌గా, ఆవిష్కర్తగా, మెషీన్ లెర్నింగ్ ఇంజనీర్‌గా హేమేశ్ రాణిస్తున్నారు. మెషీన్ లెర్నింగ్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌లతో పలు ఆవిష్కరణలు చేశారు. వృద్ధులకు ఉపయోగపడే బ్యాగ్, దివ్యాంగులు, వృద్ధుల పర్యవేక్షణ కోసం స్మార్ట్ రిస్ట్‌బ్యాండ్ వంటివి రూపొందించారు. విశాఖపట్టణానికి చెందిన 11 ఏళ్ల చిన్నారి అమేయ లగుడు భరతనాట్యంలో విశేష ప్రతిభ కనబరిచారు. నాలుగేళ్ల వయస్సు నుంచి నృత్యం నేర్చుకోవడం మొదలుపెట్టిన ఆమె.. తొలిసారిగా 2015లో నాట్యరంగంలోకి అరంగేట్రం చేశారు
0 Response to "ఇద్దరు తెలుగు బాలలకు.. రాష్ట్రీయ బాల పురస్కార్"
Post a Comment