టెన్త్ పరీక్షలపై ఏపీ విద్యాశాఖ మంత్రి కీలక ప్రకటన

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో టెన్త్ పరీక్షలు నిర్వహిస్తారా..? లేదా..? అనేదానిపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక ప్రకటన చేశారు. 



శుక్రవారం నాడు అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ ఏడాది తప్పనిసరిగా టెన్త్‌ పరీక్షలు ఉంటాయని స్పష్టం చేశారు. 



మే నెలలో టెన్త్‌ పరీక్షలను నిర్వహించాలని భావిస్తున్నామని తెలిపారు. వారం రోజుల్లో పదవతరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. 



అయితే.. 11 పేపర్లా లేదా 6 పేపర్లా అనే దానిపై నిర్ణయం తీసుకుంటామని సురేష్ తెలిపారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "టెన్త్ పరీక్షలపై ఏపీ విద్యాశాఖ మంత్రి కీలక ప్రకటన"

Post a Comment