నేడు అర్ధరాత్రి వరకు వెబ్‌ఆప్షన్లకు గడువు..

విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్

సాక్షి, అమరావతి: ఉపాధ్యాయ బదిలీల్లో వెబ్ ఆప్షన్లను శుక్రవారం అర్ధరాత్రి వరకూ నమోదు చేసుకోవచ్చని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. 18 తేదీ అర్ధరాత్రి నుంచి వెబ్ ఆప్షన్ల ఫ్రీజింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని, మొత్తం 16 వేల పోస్టులు బ్లాక్ చేశామని పేర్కొన్నారు. బ్లాకింగ్ ప్రక్రియ లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా 4008 పోస్టులు భర్తీ కాకుండా నిలిచిపోయే పరిస్థితి ఉందని ఆయన వివరించారు



మొత్తంగా ఉపాధ్యాయ బదిలీ ప్రక్రియ కోసం 74, 418 మంది ఐచ్ఛికాలను ఇచ్చారని తెలిపారు


ఉపాధ్యాయ సంఘాలతో విధానపరమైన నిర్ణయాలపై చర్చకు సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. ఇంజనీరింగ్ ఫీజులు గత ఏడాది తరహాలోనే ఉండే అవకాశముందని, తుది నిర్ణయం త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ షెడ్యూలును రేపు ప్రకటిస్తామని మంత్రి సురేష్ వెల్లడించారు


 ఉపాధ్యాయ బదిలీల కోసం శుక్రవారం (18వ తేదీ) అర్థరాత్రి వరకు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ తెలిపారు. సర్వర్‌ సమస్య కారణంగా వెబ్‌ ఆప్షన్ల గడువు పొడిగించినట్లు తెలిపారు. సవరణలు చేసుకోదలచిన వారు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. 18వ తేదీ అర్థరాత్రి తర్వాత వెబ్‌ ఆప్షన్లు ఫ్రీజింగ్‌ అవుతాయన్నారు. 19వ తేదీ తర్వాత బదిలీ ఉత్తర్వులు అందజేస్తామన్నారు. గురువారం సచివాలయంలో ఆయన మీడియాతో  మాట్లాడారు. బదిలీల కోసం 76,119 మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. తప్పనిసరిగా బదిలీ కావాల్సిన టీచర్లు 26,117 మంది ఉండగా ఇప్పటివరకు 291 మంది మినహా అందరూ వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకున్నారని చెప్పారు. 50,002 మంది రిక్వెస్ట్‌ బదిలీ కోసం దరఖాస్తు చేసుకోగా వీరిలో 1407 మంది మినహా అందరూ వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకున్నారని తెలిపారు. మొత్తంమీద 74,421 మంది బదిలీల కోసం వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకున్నారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా బదిలీ కోరుకునే వారి కోసం 32 వేల ఖాళీలు అందుబాటులో ఉన్నాయని, 16 వేల పోస్టులు మాత్రమే బ్లాక్‌ చేసినట్లు  తెలిపారు. కేటగిరీ-1,2,3ల్లోని ఖాళీలను బ్లాక్‌ చేయకుంటే కేటగిరీ-4 పరిధిలో 145 మండలాల్లోని 4008 పాఠశాలల్లో 7 వేల పోస్టులు ఖాళీ అవుతాయన్నారు.


అన్ని ఖాళీలనూ ఓపెన్‌ చేస్తే 5,725 స్కూళ్లలో 10,198 పోస్టులు ఖాళీ అవుతాయని తెలిపారు. ఖాళీలు బ్లాక్‌ చేయకుంటే మారుమూల స్కూళ్లు మూత పడతాయన్నారు. విధానపరమైన నిర్ణయాలపై ఉపాధ్యాయ సంఘాలతో చర్చలకు సిద్ధంగా ఉన్నామన్నారు. 2018లో టీడీపీ ప్రభుత్వం రేషనలైజేషన్‌ చేపట్టడం వల్ల 2,270 స్కూళ్లు మూతపడ్డాయన్నారు. అప్పుడు 630 పోస్టులు బ్లాక్‌ చేశారన్నారు.త్వరలోనే ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ప్రకటిస్తామని మంత్రి చెప్పారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to " నేడు అర్ధరాత్రి వరకు వెబ్‌ఆప్షన్లకు గడువు.."

Post a Comment