డిసెంబర్ 31 వచ్చేస్తోంది రిటర్నులు దాఖలు చేశారా..?*
డిసెంబర్ 31 వచ్చేస్తోంది రిటర్నులు దాఖలు చేశారా..?*
*ఆదాయపన్ను శాఖ ట్వీట్...*
*న్యూఢిల్లీ :* దేశ వ్యాప్తంగా డిసెంబర్ 21 నాటికి 3.75 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేశారని ఐటీ విభాగం మంగళవారం వెల్లడించింది. మిగిలిన వారు కూడా రిటర్నులు దాఖలు చేసుకోవాలంటూ సూచించింది. దాఖలుకు చివరి గడువు డిసెంబర్ 31 అని కూడా ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా ఆదాయ పన్ను శాఖ గుర్తు చేసింది. 'మీకు తెలుసా.. 2020-21 మదింపు సంవత్సరానికి (2019-20 ఆర్థిక సంవత్సరం) గానూ ఇప్పటికే 3.75 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులు ఐటీ రిటర్నులు దాఖలు చేశారు. మీరు కూడా మీ మీ రిటర్నులు సమర్పించారా..? చేయకపోతే ఇప్పుడే చేయండి..' అంటూ ఐటీ విభాగం మంగళవారం ట్వీట్ చేసింది. డిసెంబర్ 21 నాటికి 2.17 కోట్ల మంది ఐటీఆర్-1ఆర్, 79.82 లక్షల మంది ఐటీఆర్ -4, 43.18 లక్షల మంది ఐటీఆర్-3, 26.56 లక్షల మంది ఐటీఆర్-2 దాఖలు చేశారు. ఐటీ రిటర్నుల దాఖలుకు డిసెంబర్ 31 వరకు గడువు ఉంది. కరోనా పరిస్థితుల దృష్ట్యా ఈ ఏడాది ఇప్పటికే రెండు సార్లు ఐటీ రిటర్నుల దాఖలుకు కేంద్రం గడువు పొడ గించిన విషయం తెలిసిందే. తొలుత జులై 81 వరకు ఉండగా.. దాన్ని అక్టోబర్ 31 వరకు పెంచింది. ఆ తరువాత డిసెంబర్ 31 వరకు పొడగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే...
0 Response to "డిసెంబర్ 31 వచ్చేస్తోంది రిటర్నులు దాఖలు చేశారా..?*"
Post a Comment