ఖాళీలల్లో బ్లాక్ కు వ్యతిరేకంగా వెబ్ కౌన్సిలింగ్ కు వ్యతిరేకంగా 10డిశంబర్ న జిల్లా విద్యా కార్యాలయాలు ముట్టడి జయప్రదం చేయండి- ఫ్యాప్టొ సెక్రటరి జనరల్ సివిప్రసాద్(కడప) పూర్తి వివరాలు...
ఉపాధ్యాయుల బదిలీలు ఎంతమాత్రమూ ఉపాధ్యాయులకు ఆశాజనకంగా లేవు. అగమ్యగోచరంగా ఉన్నాయి. పలు మార్లు
సవరించాల్సిన అంశాలను తమ దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకు వచ్చినప్పటికీ మాన్యవల్ కౌన్సెలింగ్ విషయంలోనూ,
పోస్టుల బ్లాకింగ్ విషయంలోనూ కాలయాపనే జరుగుతోంది. చర్యలు లేవు. ఈ బదిలీల నిబంధనలు ఉపాధ్యాయులపై కక్ష
సాధింపు చేస్తున్నట్లుగా భావించాల్సి వస్తోంది.
సూచిక లోని లేఖలో ఫ్యాప్టో ప్రతిపాదించిన పై రెండు అంశాలు పరిష్కారం కాలేదు. కావున ది 10/12/2020 న జిల్లా
విద్యాశాఖాధికారుల కార్యాలయాల పికెటింగ్ నిర్వహిస్తామని ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ( ఫ్యాప్టో ) గా తమకు
తెలియజేస్తున్నాము.
డిమాండ్లు : 1) మాన్యవల్ కౌన్సెలింగ్ చేయాలి.
2) పోస్టుల బ్లాకింగ్ ఎత్తివేయాలి.
3) చైల్డ్ ఇన్ఫోలో ఇంగ్లీష్ మీడీయం కి బదులు తెలుగు మీడియంలో నమోదు కాబడిన వారిని మీడియం మార్పుకు
అనుమతి ఇచ్చి పోష్టులు కొనసాగించాలి.
0 Response to "ఖాళీలల్లో బ్లాక్ కు వ్యతిరేకంగా వెబ్ కౌన్సిలింగ్ కు వ్యతిరేకంగా 10డిశంబర్ న జిల్లా విద్యా కార్యాలయాలు ముట్టడి జయప్రదం చేయండి- ఫ్యాప్టొ సెక్రటరి జనరల్ సివిప్రసాద్(కడప) పూర్తి వివరాలు..."
Post a Comment