మహారాష్ట్రలో మే వరకు పది, ఇంటర్ పరీక్షలు లేనట్టే!
మహారాష్ట్రలో మే వరకు పది, ఇంటర్ పరీక్షలు లేనట్టే!
ముంబయి: వచ్చే ఏడాది మే వరకు పది, ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించడం కుదరదని మహారాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కరోనా మహమ్మారి తీవ్రస్థాయిలో వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్ష గైక్వాడ్ శుక్రవారం విలేకరులకు చెప్పారు. పాఠ్యాంశాలను ముందుగానే పూర్తిచేసి పరీక్షల నిర్వహణను మాత్రం ఆపాలనుకుంటున్నట్లు తెలిపారు. అందుకు అనుగుణంగా పాఠ్య ప్రణాళికలో కనీసం 25 శాతం మేర కోత విధించాలని యోచిస్తున్నట్లు వివరించారు
0 Response to "మహారాష్ట్రలో మే వరకు పది, ఇంటర్ పరీక్షలు లేనట్టే!"
Post a Comment