రాష్ట్రపతికి ఆర్థిక సంఘం నివేదిక
రాష్ట్రాల వారీ సమస్యలు, సవాళ్ల పరిశీలన
కరోనా సమయంలో ఆర్థిక సంఘం పేరుతో
4 సంపుటాల్లో 15వ సంఘం నివేదిక
న్యూఢిల్లీ, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): దేశంలోని ఒక్కో రాష్ట్రం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి రాష్ట్రాలవారీగా ప్రత్యేక సూచనలు చేస్తూ 15వ ఆర్థిక సంఘం తన నివేదిక రూపొందించింది. 2021-22 నుంచి 2025-26 కాలానికి సంబంధించిన ఆ నివేదికను.. ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్.కె.సింగ్ తన సభ్యులతో కలిసి సోమవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు సమర్పించారు. ఈ నివేదికలో మూడో సంపుటాన్ని కేంద్రప్రభుత్వానికి, నాలుగో సంపుటాన్ని పూర్తిగా రాష్ట్రాలకు కేటాయించారు.
కేంద్రం అభ్యర్థన మేరకు..
దేశం ఎదుర్కొంటున్న ప్రత్యేక సమస్యలపై కేంద్రం అభ్యర్థనల మేరకు కమిషన్ సిఫారసులు చేసింది. కేంద్ర స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ సమాంతర పన్ను పంపిణీలు, స్థానిక ప్రభుత్వాలకు నిధులు, విపత్తు నిర్వహణ గ్రాంట్లు, విద్యుత్ రంగ పునర్వ్యవస్థీకరణ, ప్రత్యక్ష ప్రయోజనాల బదిలీ పథకాలు, ఘన, వ్యర్థ పదార్థాల నిర్వహణతో పాటు అనేక రంగాల్లో రాష్ట్రాల పనితీరు, వాటికి కల్పించాల్సిన ప్రోత్సాహకాలకు సంబంధించి ఈ సిఫారసులు చేసింది.
కాగా, కరోనా సమయంలో దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు, జీఎస్టీ బకాయిలు చెల్లించాలని రాష్ట్రాలు చేస్తున్న డిమాండ్ల నేపథ్యంలో ఆర్థిక సంఘం సిఫారసులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అందునా తన నివేదికకు కమిషన్.. ‘‘కరోనా సమయంలో ఆర్థిక సంఘం’’ అని పేరు పెట్టడం గమనార్హం
0 Response to "రాష్ట్రపతికి ఆర్థిక సంఘం నివేదిక"
Post a Comment