ఉద్దేశపూర్వకంగా విద్యార్హత దాచిపెట్టడం తప్పే

సుప్రీం

న్యూఢిల్లీ, నవంబరు 3: ఉద్దేశపూర్వకంగా ఉన్నత విద్యార్హతను దాచిపెట్టి ఉద్యోగం పొందడం తప్పేనని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో ప్యూన్‌ ఉద్యోగానికి అమిత్‌ కుమార్‌ దాస్‌ అనే ఆయన ఎంపికయ్యారు. ఆ ఉద్యోగానికి ఇంటర్మీడియట్‌ విద్యార్హత. అయితే, అప్పటికే డిగ్రీ పూర్తైన దాస్‌.. తన విద్యార్హతను దాచిపెట్టి ఉద్యోగం పొందారంటూ ఆయనను ఉద్యోగం నుంచి బ్యాంకు తొలగించింది.


అభ్యర్థి తప్పుడు సమాచారం ఇచ్చాడనే కారణంతో బ్యాంకు అప్పీలును సుప్రీం విచారణకు స్వీకరించింది. ఆయనను ఉద్యోగంలోకి తీసుకోవాలంటూ ఒడిశా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పక్కనబెట్టింది. దాస్‌ వల్ల ఇంటర్మీడియట్‌ విద్యార్హత కలిగిన ఒక అభ్యర్థి ఉద్యోగ అవకాశం కోల్పోయారని ఈ సందర్భంగా కోర్టు అభిప్రాయపడింది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఉద్దేశపూర్వకంగా విద్యార్హత దాచిపెట్టడం తప్పే"

Post a Comment