ఏపీ ఇంటర్ బోర్డు అకడమిక్ క్యాలెండర్‌ విడుదల

అమరావతి: ఇంటర్ బోర్డు అకడమిక్ క్యాలెండర్‌ను అధికారులు విడుదల చేశారు. మార్చి చివరి వారంలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ విద్యా సంవత్సరంలో ఏప్రిల్ 24 వరకు తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 



ఈ విద్యా సంవత్సరంలో కాలేజీలు మొత్తం 127 రోజులు పని చేయనున్నట్లు చెప్పారు. ఏప్రిల్ 25 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ఉంటాయన్నారు. జూన్ చివరి వారంలో అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 


జూన్ 1 నుంచి 2021-22 విద్యా సంవత్సరం ప్రారంభమతుందని స్పష్టం చేశారు. రెండో శనివారం సెలవులు ఉంటాయని, టర్మ్ సెలవులు రద్దు చేస్తున్నాట్లు ఏపీ ఇంటర్‌ బోర్డు అధికారులు తెలిపారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఏపీ ఇంటర్ బోర్డు అకడమిక్ క్యాలెండర్‌ విడుదల"

Post a Comment