ఓటర్ల ప్రత్యేక ముసాయిదా జాబితా విడుదల
అమరావతి: ఓటర్ల ప్రత్యేక ముసాయిదా జాబితా-2021ను ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. వచ్చే ఏడాది జనవరి 15న ప్రచురించే తుది ఓటర్ల జాబితాకు సంసిద్ధతగా ఈ ముసాయిదాను వెలువడింది.
ఈ జాబితాపై అభ్యంతరాలు, ఫిర్యాదులు, సవరణలు పంపించాల్సిందిగా ఎన్నికల సంఘం ప్రజలను కోరింది. డిసెంబర్ 15వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు ఈసీ స్పష్టం చేసింది. 2021 జనవరి 15న ఓటర్ల తుది జాబితా సిద్ధం అవుతుందని వెల్లడించింది. ప్రస్తుతం ఏపీలో మొత్తం ఓటర్ల సంఖ్య 4 కోట్ల లక్షా 45 వేల 674 మంది ఓటర్లు ఉన్నట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది

0 Response to "ఓటర్ల ప్రత్యేక ముసాయిదా జాబితా విడుదల"
Post a Comment