వాట్సాప్‌ ‘పేమెంట్‌’కు ఎన్‌పీసీఐ అనుమతి

ముంబై, నవంబరు 5: ఫేస్‌బుక్‌కు చెందిన మెసేజింగ్‌ ప్లాట్‌ఫామ్‌ వాట్సాప్‌ తన పేమెంట్‌ సర్వీసును దేశీయంగా ప్రారంభించేందుకు నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) గురువారం అనుమతిచ్చింది. ఈ మేరకు గ్రేడెడ్‌ విధానంలో వాట్సాప్‌ తన సర్వీసులను ప్రారంభించనుంది. యూపీఐలో గరిష్ఠంగా రెండు కోట్ల మంది రిజిస్టర్డ్‌ యూజర్లతో ఆరంభించి వాట్సాప్‌ తన వినియోగదారుల సంఖ్యను పెంచుకునేందుకు అవకాశం ఉంటుందని ఎన్‌పీసీఐ పేర్కొంది.


వాట్సాప్‌ గత రెండేళ్లుగా తన యూపీఐ ఆధారిత పేమెంట్‌ పైలెట్‌ సర్వీసును నడుపుతోంది. కానీ డేటా లోకలైజేషన్‌ అవసరాల కారణంగా అధికారికంగా అనుమతి లభించలేదు. తాజాగా ఎన్‌పీసీఐ నుంచి గ్రీన్‌సిగ్నల్‌ లభించింది. కాగా.. వాట్సాప్‌, గూగుల్‌పే లేదా ఫోన్‌పే వంటి సింగిల్‌ థర్డ్‌ పార్టీ సంస్థలు మొత్తం యూపీఐ లావాదేవీల పరిమాణంలో 30 శాతం మాత్రమే నిర్వహించే విధంగా పరిమితి విధిస్తూ ఎన్‌పీసీఐ ప్రకటన చేసింది. 


ఏడు రోజుల తర్వాత మెసేజ్‌లు మాయం.. వాట్సా్‌పలో సరికొత్త ఫీచర్‌ 

వాట్సాప్‌ ‘డిసప్పియరింగ్‌ మెసేజెస్‌’ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్‌ ద్వారా ఒక చాట్‌కు పంపిన కొత్త మెసేజ్‌లు వారం తర్వాత మాయమైపోతాయి. ఈ నెలలోనే ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు వాట్సాప్‌ తెలిపింది. ఈ ఫీచర్‌ యూజర్లకు మరింత ప్రైవసీని ఇస్తుందని పేర్కొంది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "వాట్సాప్‌ ‘పేమెంట్‌’కు ఎన్‌పీసీఐ అనుమతి"

Post a Comment