కొడుకును ప్రభుత్వ స్కూల్ లో చేర్పించిన ఐఏఎస్..!
సాధారణంగా ప్రభుత్వ అధికారులు ఎవరూ కూడా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడానికి అంతగా ఆసక్తి చూపరు. ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలు అభివృద్ధి చేయాలని ఆయా అధికారులు ఊకదంపుడు ఉపన్యాసం చేస్తారు గానీ వారి పిల్లలను మాత్రం ప్రభుత్వ పాఠశాలలో చేర్పించరు. పేరున్న ప్రైవేట్ స్కూల్ లోనే చేర్పిస్తు ఉంటారు. అయితే ఓ ఐఏఎస్ అధికారి మాత్రం అందరికంటే భిన్నంగా ఆలోచించారు. అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఆయనే విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ పీవో కూర్మనాథ్. ఐఏఎస్ అధికారి స్థానంలో ఉన్నప్పటికీ తన కుమారుడుని మాత్రం ఒక సాదాసీదా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటిడిఎ పిఓ కూర్మనాథ్ పదవ తరగతి చదువుతున్న తన కుమారుని కొత్త పోలమ్మ పురపాలక పాఠశాలలో చేర్పించారు
0 Response to "కొడుకును ప్రభుత్వ స్కూల్ లో చేర్పించిన ఐఏఎస్..!"
Post a Comment