కేంద్ర బడ్జెట్‌పై సూచనలకు ఆహ్వానం
మైగవ్ పోర్టల్ ద్వారా పంపొచ్చు
ఈనాడు, దిల్లీ: కేంద్ర ప్రభుత్వం 2021-22 బడ్జెట్‌కు సంబంధించి సాధారణ ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించనుంది. ఇందుకోసం మైగవ్ పోర్టల్‌లో ఈనెల 15 నుంచి ఒక మైక్రోసైట్ ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. ప్రజలు మైగవ్ పోర్టల్‌లో పేరు నమోదుచేసుకొని బడ్జెట్‌పై సూచనలు పంపొచ్చని ఆర్థికశాఖ సూచించింది. వాటిని సంబంధిత మంత్రిత్వశాఖలు పరిశీలిస్తాయని తెలిపింది. అవసరమైతే మైగవ్ పోర్టల్‌లో పేరు నమోదు చేసుకొనేటప్పుడు పేర్కొన్న ఈమెయిల్, ఫోన్ నెంబర్ల ద్వారా సంబంధిత వ్యక్తులను సంప్రదించి, వారు చేసిన సూచనలపై మరిన్ని వివరాలు తెలుసుకుంటామని తెలిపింది. నవంబర్ 30 వరకు సూచనలు పంపొచ్చని వెల్లడించింది. బడ్జెట్‌కు సంబంధించి వాణిజ్య, వ్యవసాయ, కార్మిక సంఘాలు, ప్రతినిధుల సూచనల కోసం ప్రత్యేక ఈమెయిల్‌ను ఏర్పాటు చేయడానికి కేంద్రం నిర్ణయించింది
0 Response to "కేంద్ర బడ్జెట్‌పై సూచనలకు ఆహ్వానం"
Post a Comment