బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం
అమరావతి:
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం క్రమంగా బలపడి
తీవ్రవాయుగుండంగా మారే సూచనలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది.
ప్రస్తుతం విశాఖకు ఆగ్నేయంగా 430 కిలోమీటర్లు, కాకినాడకు 490 కిలోమీటర్ల
దూరంలో కేంద్రీకృతమైనట్టు వెల్లడించింది.
తీవ్ర వాయుగుండం నర్సాపురం-విశాఖ
మధ్య రేపు రాత్రికి తీరం దాటే అవకాశముందని వాతావరణశాఖ అంచనా వేసింది.ఈ
ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ
పేర్కొంది. ఉత్తర కోస్తా జిల్లాల్లో చాలా చోట్ల భారీ వర్షాలు కురిసే సూచనలు
ఉన్నాయని వెల్లడించింది
సోమవారం
ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అత్యంత భారీ
వర్షాలు పడొచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఆది, సోమవారాల్లో తీరంలో
గాలుల వేగం గంటకు 45-70 కి.మీ. దాకా ఉండొచ్చని పేర్కొన్నారు.
సముద్రంరుగ్గా ఉందని, చేపల వేటకు వెళ్లకూడదని ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు
మత్స్యకారులను హెచ్చరిస్తున్నారు. కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ
వర్షాలు, ఆ తర్వాత తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడొచ్చని
చెబుతున్నారు. ఈనెల 15వ తేదీ దాకా వర్షాలు కొనసాగుతాయని పేర్కొన్నారు
0 Response to "బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం"
Post a Comment