అడోబ్ అందించే ఉచిత యాప్‌లివీ
ఇంటర్నెట్
డెస్క్: ఫొటో ఎడిటింగ్, డాక్యుమెంట్ స్కానింగ్ ఇలా ప్రతి అవసరానికీ ఎన్నో
రకాల యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిలో కొన్ని ఉచితంగా లభించే
యాప్‌లైతే.. కొన్నింటికి మనం సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సి
ఉంటుంది. అడోబ్ వంటి ప్రముఖ కంపెనీల అందించే సేవలను పొందాలంటే ప్రతి
యాప్‌కు ఎంతోకొంత చెల్లించడం తప్పనిసరి. అందువల్లే ఎక్కువ మంది వీటి వాడకం
తగ్గించి ఉచితంగా లభించే యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకునేందుకు మొగ్గు
చూపుతున్నారు. దీంతో అడోబ్ కూడా కొన్ని యాప్స్, ప్రోగ్రామ్స్‌ను ఉచితంగా
అందించాలని ఇటీవల నిర్ణయం తీసుకుంది. డిజైనింగ్, గ్రాఫిక్స్ రంగాల్లో
పనిచేస్తున్న వారికి ఈ ఉచిత యాప్స్ ఎంతో ఉపయోగపడతాయి.
అవేంటంటే
అడోబ్ ఫొటోషాప్ కెమెరా
మొబైల్
కెమెరా ఎక్కువగా వాడే వారికి ఈ యాప్ ఎంతో ఉపయోగపడుతుంది. సాధారణంగా ఫొటో
తీసిన తర్వాత ఫిల్టర్స్ అప్లై చేస్తాం. కానీ ఫొటోషాప్ కెమెరాలో ఫొటో
తీయడానికి ముందే ఫిల్టర్స్ అప్లై చేసి ప్రివ్యూ చూడొచ్చు. అడోబ్ సెన్సయి,
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాఫ్ట్‌వేర్ ఆధారంగా ఇది పనిచేస్తుంది.
అయితే ఇందుకోసం ఇంటర్నెట్ కనెక్షన్ కావాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ
యాప్‌లో ఏఐ ఆధారిత ఫొటో ఎడిటింగ్ ఫీచర్ కూడా ఉంది. ఇది ఫొటోలకు
బ్యాక్‌గ్రౌండ్ మార్చడం, అవసరమైన ఆబ్జెక్ట్‌లను యాడ్ చేయడం వంటివి
చేస్తుంది. ఇంకా ఈ ఉచిత యాప్‌లో అద్భుతమైన ఫొటో ఎడిటింగ్ ఫీచర్స్ ఉన్నాయి.
ఈ యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్స్‌కి అందుబాటులో ఉంది
అడోబ్ లైట్ రూం
సెలబ్రిటీలు
తమ ఫొటోలకు ఎడిట్ చేసేందుకు ఎక్కువగా ఉపయోగించే యాప్.. అడోబ్ లైట్ రూం. ఈ
యాప్‌లో లైట్స్, షాడోస్‌తో ఫొటోలను అందంగా తీర్చిదిద్దొచ్చు. ఇంకా ఇందులో
ఫొటోలకు ఎలా మెరుగులద్దానేది తెలుసుకునేందుకు ఉచితంగా ట్యుటోరియల్స్‌ను
అందిస్తున్నారు. లైట్ రూంలో లెర్న్ సెక్షన్‌లో బిగినర్, ఇంటర్మీడియెట్,
అడ్వాన్స్‌డ్ యూజర్స్ అని ఆప్షన్స్ ఉంటాయి. వాటి ద్వారా ఫొటోలను అందంగా
ఎలా ఎడిట్ చేయాలనేది ఉచితంగా నేర్చుకోవచ్చు. అయితే ఇందులో లైట్ రూం
ప్రీమియం వెర్షన్ పొందాలంటే మాత్రం సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే
ఫొటోషాప్ మిక్స్
ఫొటోషాప్
టచ్, ఫొటోషాప్ ఎక్స్‌ప్రెస్ కలయికగా ఫొటోషాప్ మిక్స్‌ను తీసుకొచ్చారు.
ఫొటో ఎడిటింగ్ నేర్చుకోవాలనుకునేవారు ఈ యాప్‌ను సులభంగా ఉపయోగించొచ్చు.
ఇందులో ఐదు లేయర్లను కలిపి కాంప్లెక్స్ ఇమేజ్‌లను రూపొందించొచ్చు. అలానే
ఒపాసిటీ, బ్లెండ్ మోడ్స్, మల్టిపుల్ ఫిల్టర్స్‌ను అప్లై
చేయొచ్చు. మొబైల్‌లో ఫొటో ఎడిటింగ్‌పై ఎక్కువ ఆసక్తి కనబరిచేవారు ఈ యాప్‌ను
ప్రయత్నించొచ్చు
అడోబ్ అక్రోబాట్ రీడర్
ఫీడీఎఫ్
రీడింగ్ టూల్స్‌లో అడోబ్ అక్రోబాట్ రీడర్‌ను పెద్దన్నగా వ్యవహరిస్తారు.
ఎప్పుడు అక్రోబాట్ రీడర్‌లో డాక్యుమెంట్ ఓపెన్ చేసినా సబ్‌స్క్రిప్షన్
చేసుకోండి అంటూ పాప్-అప్ నోటిఫికేషన్ కనిపిస్తుంది. ఇక మీదట అలాంటి
నోటిఫికేషన్స్ మీకు ఏ మాత్రం కనిపించవు. ఎందుకంటే అక్రోబాట్ రీడర్‌ని
డెస్క్‌టాప్, మొబైల్ వెర్షన్లలో ఉచితంగా అందించాలని అడోబ్ నిర్ణయించింది.
ఇందులో డిజిటల్ సైన్ ఇమేజ్‌ను సులువుగా అప్‌లోడ్ చేసుకోవచ్చు. మీ
సంతకానికి సరిపోయే ఫాంట్‌ను ఎంచుకోవడం ద్వారా గానీ లేకపోతే టచ్
స్క్రీన్‌పై వేలితో గానీ మొబైల్ ఫోన్లలో సులభంగా సంతకం చేయొచ్చు. పీడీఎఫ్
డాక్యుమెంట్‌ను సులువుగా చదివేందుకు అడోబ్ ఇటీవల పరిచయం చేసిన లిక్విడ్
మోడ్ కూడా ఇందులో ఉంది. పీడీఎఫ్ డాక్యుమెంట్స్ కోసం మొబైల్ యూజర్స్‌కి
అడోబ్ అక్రోబాట్ రీడర్ ఉత్తతమైన యాప్
అడోబ్ కలర్
కొత్తగా
ఏదైనా బ్యానర్ చేయాలకున్నా.. పోస్టర్ రూపొందించాలన్నా ముందుగా కలర్
ఎంపిక ఎంతో ముఖ్యం. బ్యాక్‌గ్రౌండ్ కలర్, టెక్ట్స్ కలర్ ఇలా వివిధ రకాలు
ఉంటాయి. అయితే వాటి ఎంపిక అంత సులభం కాదు. ఇలాంటి విషయాల్లో సాయం చేసేందుకు
అడోబ్ కలర్ అనే వెబ్ ప్రోగ్రాంను అడోబ్ తీసుకొచ్చింది. దీన్ని ఎవరైనా
ఉచితంగా వాడుకోవచ్చు. ఇందులో కలర్ వీల్ సాయంతో మనకు నచ్చిన రంగుని వివిధ
రకాల షేడ్స్, థీమ్స్‌లో ఎంపిక చేసుకోవచ్చు
0 Response to "అడోబ్ అందించే ఉచిత యాప్‌లివీ"
Post a Comment