బడి ఒక్కపూటే..: ఏకే సింఘాల్
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూళ్లు ఒక్కపూట మాత్రమే ఉంటాయని ఆరోగ్యశాఖ
ముఖ్య కార్యదర్శి ఎ.కె.సింఘాల్ చెప్పారు. పకడ్బందీ ఏర్పాట్లు మధ్య పాఠశాలల
ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. హెడ్‌మాస్టర్లకు పూర్తి
బాధ్యతలు అప్పగిస్తున్నామని, వారు స్థానిక ఏఎన్‌ఎం, ఆశా వర్కర్లతో సమన్వయం
చేసుకుని పిల్లలు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు
ఆరా తీయాల్సి ఉంటుందన్నారు. కేంద్ర నిబంధనలకు అనుగుణంగానే పాఠశాలలు
ప్రారంభిస్తున్నట్లు వివరించారు. పిల్లల్ని బడికి పంపడానికి తల్లిదండ్రుల
అనుమతి తప్పనిసరిగా ఉండాలన్నారు. ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు
కూడా అనుమతి తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రతి జిల్లాలో పాఠశాలల
పర్యవేక్షణకు కలెక్టర్లు టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తారని వివరించారు
0 Response to "బడి ఒక్కపూటే..: ఏకే సింఘాల్"
Post a Comment