విజయదశమి అంటే ఏమిటి ? ఈరోజు ఏం చేయాలి ?

విజయదశమి అంటే ఆరోజు సూర్యోదయానికి శ్రవణ నక్షత్రం ఉండాలి. శ్రవణ నక్షత్రానికి అధిదేవత విష్ణువు. నక్షత్ర మండలంలో శ్రవణ నక్షత్రం చెవి ఆకారంలో ఉంటుంది. అందుకే ఏదైనా కొత్త విద్యలు నేర్చుకోవాలనుకొనేవారు ఈ రోజు ప్రారంభిస్తే విశేషంగా లాభిస్తుంది.



శమీ పూజ లాభాలకు బాట !
దసరానాడు ఆయా ప్రాంతాలను బట్టి కొన్ని ఆచారాలు వస్తున్నాయి. వీటిలో ముఖ్యంగా శమీ చెట్టు పూజ చేయడం ఆనవాయితీ. జమ్మి చెట్టును పూజించడం లక్ష్మీప్రదమని పురాణాలు చెబుతున్నాయి. శమీ వృక్షం సువర్ణ వర్షం కురిపిస్తుందని శాస్త్రాల్లో ఉంది. విజయదశమి రోజున పూజలు అందుకొన్న జమ్మి చెట్టు ఆకులను ఇంట్లోని పూజా స్థలంలో, ధన స్థానంలో నగదు గల్ల పెట్టెల్లో పెట్టుకుంటారు


దీనివల్ల ధనవృద్ది జరుగుతుంది. పాలపిట్ట దర్శనం, దేవాలయ దర్శనం,పెద్దల ఆశీర్వాదాలు తీసుకోవడం చేయాలి. శత్రుత్వాలు వదిలి అలాయ్‌బలాయ్‌ ఇచ్చుకునే రోజు ఇది. శిష్టరక్షణకు ప్రతీక ఈ పండుగ

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "విజయదశమి అంటే ఏమిటి ? ఈరోజు ఏం చేయాలి ?"

Post a Comment