ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు

నవంబర్‌ నుంచి వాయిదా జీతాల చెల్లింపు

అమరావతి: పండగ వేళ ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సర్కార్‌ తీపి కబురు చెప్పింది. కరోనా కారణంగా వాయిదా వేసిన ఉద్యోగుల వేతనాలు, పింఛన్లను నవంబర్‌ నెల వేతనంతో చెల్లించనుంది. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. మార్చి, ఏప్రిల్‌ నెలలకు సంబంధించిన సగం జీతాలను 5 విడతలుగా ప్రభుత్వం చెల్లించనుందని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్‌ అధ్యక్షుడు వెంకట్రామ్‌ రెడ్డి తెలిపారు.



2018 జులై నుంచి 2019 డిసెంబర్‌ వరకు పెండింగ్‌లో ఉన్న మూడు డీఏలు చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. అలాగే పెండింగ్‌లో ఉన్న డీఏలలో మొదటి విడతగా 2021 జనవరి నుంచి, రెండో డీఏను 2021 జులై నుంచి, అలాగే మూడో డీఏని 2022 జనవరి నుంచి చెల్లించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది


2015లో చేసిన పెంపు మేరకు ఉద్యోగులకు 30.392 శాతం డీఏని చెల్లించనున్నారు. పెరిగిన డీఏ ప్రకారం మొదటి విడతపై నెలకు అదనంగా రూ. 86.41 కోట్ల మేర భారం ప్రభుత్వంపై పడనుంది. ఇక 2021లో చెల్లించాల్సిన రెండో డీఏ బకాయిపై నెలకు రూ.172 కోట్లు అదనంగా చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. మొత్తంగా 4,49,000 మంది ఉద్యోగులు, 3,57,000 మంది పింఛనర్లకు పెంచిన డీఏ మొత్తాలు ప్రభుత్వం చెల్లించనుంది



.కాని తక్షణం ఇవాల్సిన డి.ఎ లు కూడా ఇప్పుడో ఇస్తామనటం ఉద్యోగులను నిరాశకు గురిచేస్తున్నదని ఎపిటియఫ్ జిల్లా ప్రధానకార్యదర్శి సివిప్రసాద్ అభిప్రాయపడ్డారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు"

Post a Comment