ఇంగ్ల్లిష్‌ మీడియం’పై ఇద్దరు పిల్లల పిటిషన్‌

న్యూఢిల్లీ, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): ఏపీలో ప్రభుత్వ పాఠశాలలను ఇంగ్లీష్‌ మీడియంకు మార్చుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఇద్దరు పిల్లలు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.



 గుంటూరు జిల్లాకు చెందిన 5వ తరగతి విద్యార్థి షేక్‌ మహమ్మద్‌ తౌఫిక్‌, 9వ తరగతి విద్యార్థి షేక్‌ వసామ దాఖలు చేసిన ఈ పిటిషన్‌ బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే ధర్మాసనం ముందుకు వచ్చింది. 


గతంలో హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌కు ధర్మాసనం ఈ పిటిషన్‌ను జత చేసి ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఇంగ్ల్లిష్‌ మీడియం’పై ఇద్దరు పిల్లల పిటిషన్‌"

Post a Comment