ఆకర్షణీయంగా ఆధార్‌ క్రెడిట్‌ కార్డు పరిమాణంలో రూపకల్పన

  ఆధార్‌ కార్డు ఆకర్షణీయమైన సరికొత్త రూపును సంతరించుకుంది. డెబిట్‌/క్రెడిట్‌ కార్డు పరిమాణంలోకి మారిపోయింది. ఇక నుంచి ఇది పర్స్‌లో ఇమిడిపోయేంత చిన్నగా ఉండనుంది. పాలి వినైల్‌ క్లోరైడ్‌(పీవీసీ)తో రూపొందే ఈ కార్డు ధరను రూ. 50గా నిర్ణయించారు. ఈ తరహా కార్డు కావాలనుకున్న వారు



 https://uidai.gov.in/   వెబ్‌సైట్‌లోకి వెళ్లి తమ ఆధార్‌కార్డు వివరాలను నమోదు చేసి చరవాణికి వచ్చే ఓటీపీని నమోదు చేయాలి. ఆపై కార్డులోని వివరాలను సరిచూసుకుని కార్డు ధరను డెబిట్‌/క్రెడిట్‌ కార్డు, నెట్‌బ్యాంకింగ్‌తో చెల్లించాలి.


ఆఆ తరువాత ఆధార్‌కార్డులో పేర్కొన్న చిరునామాకు కొత్త కార్డును యూఐడీఏఐ పది రోజుల్లో స్పీడ్‌ పోస్టు ద్వారా పంపుతుంది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to " ఆకర్షణీయంగా ఆధార్‌ క్రెడిట్‌ కార్డు పరిమాణంలో రూపకల్పన"

Post a Comment