ఉపాధ్యాయ బదిలీలు, ఇవే మార్గదర్శకాలు

👇👇👇 ఉపాధ్యాయ బదిలీలు,  ఇవే మార్గదర్శకాలు*

❇️ఎట్టకేలకు రాష్ట్ర
ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలు, సర్దుబాటుకు (రీఅప్పోర్షన్ మెంట్) మార్గదర్శకాలు జారీ చేసింది. 





Note *LONGSTANDING based on Academic years*.

I.e
To Gr II Hm 5 academic years

To SGT/SA/PET/PD 8ACADEMIC YEARS

At present only guide lines released.

Transfer schedule may release soon

TRANSFERS Only on web based

Service points
0.5points to each year rendered service.

NOTE
Ceiling imposed on service points
I.e Max 15points only

 *MAJOR CHANGE*
👇
PH Above 70% are only eligible for  Prefferential category.

Points given to PH's From 40-69% 

5points to 40-55%
10points to 56-70%

*GO MS No. 53 Dated: 12-10-2020 ప్రకారం*
👇
*150 అంతకన్న తక్కువ విద్యార్థులు ఉన్న పాఠశాలల్లోని LFL HM లకు కంపల్సరీ బదిలీ లేదు. (8 విద్యా సంవత్సరాలు పూర్తి కాకపోతే). వారి స్థానంలో ఆ పాఠశాలలోని SGT  సర్దుబాటు చేయబడుతారు*

ఆ SGT LONGSTANDING అయితే no points కాకపోతే 5points

Cutoff date for compulsory transfer
👇
*18-11-2012 కు ముందు చేరిన SGT, SA లు etc..*

*18-11-2015 కు ముందు చేరిన HM's తప్పనిసరిగా బదలీ!*

 *ఒకవేళ బదిలీల పాయింట్లు సమానమైతే ప్రాధాన్యత క్రమం*
i. కేడర్ లో సీనియర్
Ii. పుట్టిన తేది
iii. మహిళ



❇️రాష్ట్రం లోని జిల్లా, మండల పరిషత్ ప్రభుత్వ పాఠశాలల్లో ఒకేచోట ఐదు విద్యాసంవత్సరాలు పని చేసిన గ్రేడ్-2 ప్రధానోపాధ్యాయులు,
ఎనిమిది విద్యాసంవత్సరాలు పని చేసిన ఉపాధ్యాయులు
విధిగా బదిలీకానున్నారు.

 ❇️హెచ్ఎం లు, ఉపాధ్యాయులు
ఒకేచోట రెండేళ్లు పని చేసినా బదిలీకి దరఖాస్తు చేసుకోవచ్చని
ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య
కార్యదర్శి బీ రాజశేఖర్ సోమవారం రెండు వేర్వేరు ఉత్తర్వులు
జారీ చేశారు.

 ❇️తాజా ఉత్తర్వులలో జిల్లా, మండల పరిషత్
ప్రభుత్వ స్కూళ్లలోని గ్రేడ్-2 హెచ్ఎంలు, స్కూల్ అసిస్టెంట్,
సెకండరీ గ్రేడ్ టీచర్ల బదిలీలకు మార్గదర్శకాలు జారీ
చేయగా, ఇవే మార్గదర్శకాలను మున్సిపల్, గిరిజన సంక్షేమశాఖ కూడా ప్రత్యేకంగా జారీ చేయనున్నట్లు ప్రభుత్వం
తెలిపింది. 

❇️బదిలీలు, సర్దుబాటునకు పాఠశాల విద్య డైరెక్టర్ విడిగా షెడ్యూల్ ను జారీ చేస్తారు. వెబ్ కౌన్సెలింగ్ విధానంలోనే బదిలీల ప్రక్రియను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.

 ❇️ఇందుకోసం ఉపాధ్యాయులు, హెచ్ఎంలు ఆన్లైన్లో
దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. దరఖాస్తుతోపాటు సర్వీసు పాయింట్లకు సంబంధించిన డాక్యుమెంట్లను జత చేయాలి.

❇️ప్రాథమిక పాఠశాలల్లో 60 మందిలోపు విద్యార్థులున్న
స్కూళ్లలో ఇద్దరు టీచర్లు, 90 వరకు ఉంటే ముగ్గురు, 151పైన ఉన్న స్కూళ్లకు హెచ్ఎం పోస్టును మంజూరు
చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

 ❇️సర్దుబాటు ప్రక్రియకు
కలెక్టర్ చైర్మన్ గా, జాయింట్ కలెక్టర్ (గ్రామ, వార్డు సచివాలయ, అభివృద్ధి) వైస్ చైర్మన్‌గా,
జిల్లా విద్యాశాఖాధికారి
(డీఈఓ) కన్వీనర్‌గా కమిటీని ఏర్పాటు చేసింది. 

❇️జడ్పీ స్కూళ్లలో బదిలీలకు జడ్పీ చైర్ పర్సన్ లేదా స్పెషలాఫీసర్
చైర్మన్ గా, ప్రభుత్వ స్కూళ్లకు కలెక్టర్ లేదా జేసీ (అభివృద్ధి)
చైర్మన్ కమిటీలను నియమించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

*🍁బదిలీలకు మార్గదర్శకాలు*

• 2019-20 విద్యాసంవత్సరం ముగిసే సమయానికి ఐదు విద్యాసంవత్సరాలు పని చేసిన గ్రేడ్-2 హెచ్ఎంలు, ఎనిమిది
విద్యా సంవత్సరాలు పని చేసిన ఉపాధ్యాయులు విధిగా బదిలీ

• ❇️2012 నవంబరు 18కి ముందు చేరిన టీచర్లు, 2015
నవంబరు 18కు ముందు చేరిన గ్రేడ్-2 హెచ్ఎంలకు అమలు

• ❇️ఈ ఏడాది అక్టోబరు 1 నుంచి రెండేళ్లలోపు పదవీ విరమణ చేయనున్న వారికి బదిలీల నుంచి మినహాయింపు. అయితే, వారు కోరుకుంటే మాత్రం బదిలీ చేస్తారు

• ❇️బాలికల హైస్కూళ్లలో పని చేస్తూ, అక్టోబరు ఒకటికి 50
ఏళ్లలోపు వయసున్న పురుష గ్రేడ్-2 హెచ్ఎంలు విధిగా బదిలీ

• ❇️గ్రేడ్-2 మహిళా హెచ్ఎంలు అందుబాటులో లేకపోతే
అక్టోబరు 1కి 50 ఏళ్ల వయస్సు దాటిన వారిని బాలికో న్నత హైస్కూళ్లకు బదిలీ చేయవచ్చు

• ❇️ఈ ఏడాది అక్టోబరు 1నాటికి గ్రేడ్-2 హెచ్ఎంలు,  ఉపాధ్యాయులు రెండేళ్ల సర్వీసు నిండినా బదిలీకి దరఖాస్తు చేసుకోవచ్చు

❇️ఎన్‌సీసీ, స్కౌట్ యూనిట్ ఆఫీసర్లుగా ఉన్న హెచ్ఎం,
టీచర్లు ఆ యూనిట్లు ఉన్న స్కూళ్లకే బదిలీ కావాలి. ఒకవేళ
అలాంటి ఖాళీలు ఎక్కడా లేకపోతే వారి వినతిమేరకు ప్రస్తుతం
ఉన్న స్కూళ్లలోనే కొనసాగే అవకాశం ఉంది

• ❇️ఉర్దూ, తమిళం, కన్నడం, ఒడియాను మొదటి భాషగా
చదివిన గ్రేడ్-2 హెచ్ఎంలకు ఆ మీడియం ఉన్న స్కూళ్లకు బదిలీ చేసేందుకు ప్రాధాన్యం

• ❇️ఒకే స్కూల్ లో ఎనిమిది విద్యాసంవత్సరాలు పని చేస్తే కేడరను విధిగా పరిగణనలోకి తీసుకుంటారు

• ❇️దివ్యాంగులకు బదిలీల నుంచి మినహాయింపు ఇచ్చారు. అయితే, వారు బదిలీ కోరుకుంటే కౌన్సెలింగ్ కు దరఖాస్తు
చేసుకోవచ్చు.

• ❇️ప్రస్తుతం పని చేస్తున్న యాజమాన్య పరిధిలోనే బదిలీలు
జరుగుతాయి

• ❇️ఎవరైనాసరే మాతృసంస్థకు వెళ్లాలంటే, సంబంధిత
స్కూలో ఖాళీలుంటేనే బదిలీ చేస్తారు. అది సీనియార్టీని పరిగణనలోకి తీసుకుంటారు

• ❇️ఏజెన్సీ ప్రాంతాల్లో పని చేస్తున్న స్థానిక గిరిజన ఉపాధ్యాయులు మినహా, మిగిలిన వారికి ఏజెన్సీ నుంచి
మైదాన ప్రాంతానికి, మైదాన ప్రాంతం నుంచి ఏజెన్సీ ప్రాంతానికి బదిలీలు ఉంటాయి

• ❇️ఏజెన్సీలో పని చేస్తున్న గిరిజనేతర హెచ్ఎం, ఉపాధ్యాయులు మైదాన ప్రాంతాలకు బదిలీ అయ్యేందుకు అవకాశం
ఉంది అయితే, వారి స్థానంలో ఎవరైనా చేరితేనే వారిని రిలీవ్
చేస్తారు

• ❇️గిరిజన ప్రాంతాల్లో ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ కాకపోతే,
కౌన్సెలింగ్ పూర్తయిన తర్వాత మైదాన ప్రాంతాల్లో జూనియర్
టీచర్లను డిప్యుటేషన్ పై పంపిస్తారు

• ❇️ఉపాధ్యాయుల సర్దుబాటు అంశంలో విద్యార్థి, ఉపాధ్యాయ
నిష్పత్తి ప్రకారం మిగులు పోస్టులను వేరే స్కూల్ కు బదిలీ చేయాలనుకున్నపుడు ఎనిమిదేళ్ల సర్వీసు నిండిన టీచరకు
స్థానచలనం కలుగుతుంది.
ఒకవేళ అలాంటి టీచర్లు లేకపోతే ఆ స్కూల్ లో ఉన్న సీనియర్ టీచర్ ఇష్టపడితే సర్దుబాటు చేస్తారు

• ❇️ఈ రెండు కేటగిరి టీచర్లు లేకపోతే జూనియర్‌ను వేరే
స్కూలకు పంపిస్తారు

*🍁పాయింట్లు ఇలా*

*❇️బదిలీకి దరఖాస్తు చేసుకునే గ్రేడ్-2 హెచ్ఎం, ఉపాధ్యాయులకు పని చేసిన ప్రాంతాల ప్రాతిపదికన
పాయింట్లను కేటాయిస్తారు.

 ❇️కేటగిరి-1లోని (20 శాతం, ఆపై
హెచ్ ఆర్ఎ) వారికి సంవత్సరానికి ఒక పాయింట్ ను
కేటాయిస్తారు.

 ❇️కేటగిరి-2లోని (14.50 హెచ్ ఆర్ఎ) ఏడాదికి రెండు, కేటగిరి-3లోని (12 శాతం హెచ్ ఆర్ఎ)
సంవత్సరానికి మూడు పాయింట్లను, కేటగిరి-4లో
(HRA12 శాతం, రోడ్డు సౌకర్యం లేని గ్రామాలలో)
ఏడాదికి ఐదు పాయింట్లను కేటాయిస్తారు. 

❇️గరిష్టంగా
ఎనిమిదేళ్లకు 40 పాయింట్లను కేటాయించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

 ❇️ఒకవేళ హెల్తప్, రోడ్డు కనెక్టివిటీ మారితే,
అలాంటి టీచర్లకు జిల్లాస్థాయి కమిటీ పాయిం ట్లను
కేటాయిస్తుంది. 

❇️అలాంటి స్కూళ్లలోని వారికి ఏడాదికి 0.5
మార్కులు కేటాయించనున్నారు. వివాహేతర మహిళా
టీచర్లకు ఐదు పాయింట్లను, స్పౌజ్ కేసులకు ఐదు,
దివ్యాంగులకు (40 శాతం నుంచి 55 శాతం) ఐదు, 56 శాతం నుంచి 69 శాతం ఉంటే 10 పాయింట్లను, గుర్తింపు
పొందిన ఉపాధ్యాయ సంఘాల అధ్యక్ష, ప్రధాన
కార్యదర్శులకు ఐదు పాయింట్లను కేటాయించనున్నట్లు
ప్రభుత్వం ఉత్తర్వులలో పేర్కొంది. 

❇️సర్దుబాటుకు అర్హత ఉన్న టీచర్లు, హెచ్ఎంలకు ఐదు పాయింట్లను అదనంగా
కేటాయిస్తారు. ఒకవేళ బదిలీకి ఎలాంటి ఆప్షన్ ఇవ్వకపోతే వారిని కేటగిరి-3 లేదా కేటగిరి-4లోని ఖాళీ పోస్టులకు సర్దుబాటు చేస్తారు.

*🍁ఖాళీల గుర్తింపు ఇలా*

- అన్ని ఖాళీ పోస్టులు

• విధిగా బదిలీ అయ్యే స్థానాలు

• కౌన్సెలింగ్ వల్ల ఖాళీ అయ్యే స్థానాలు
, ఏడాదిగా అనధికారికంగా గైర్హాజరైన పోస్టులు

- మెటర్నిటీ, మెడికల్ లీవులో (నాలుగు వారాలు) ఉన్న
పోస్టులను ఖాళీగా చూపరు

ఖాళీల వివరాలను కేటగిరి వారీగా, పాఠశాలల వారీగా వెబ్ సైట్లో ఉంచుతారు

• ఆన్లైన్ దరఖాస్తులకు గడువు ముగిసిన తర్వాత సీనియార్టీ జాబితాను ఆన్ లైన్ లో ఉంచుతారు
👏👏👏👏💐💐💐💐💐💐💐

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఉపాధ్యాయ బదిలీలు, ఇవే మార్గదర్శకాలు"

Post a Comment