ఉపాధ్యాయుడి ద్వారా 39మందికి కరోనా

సత్తెనపల్లి: గుంటూరు జిల్లాలో ఓ ట్యూషన్‌ ఉపాధ్యాయుడి నిర్లక్ష్యం విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా కరోనా బారినపడేలా చేసింది. సత్తెనపల్లి మండలం భట్లూరులో ప్రైవేటు ఉపాద్యాయుడికి కరోనా లక్షణాలు కనిపించగా.. పరీక్షలు చేయిస్తే పాజిటివ్‌గా నిర్థారణ అయింది. అతను భట్లూరులో ట్యూషన్‌ సెంటర్ నిర్వహిస్తున్నారు.




 దీంతో అప్రమత్తమైన అధికారులు అతని వద్దకు వచ్చే 50 మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు చేయించగా 14 మందికి పాజిటివ్‌ అని తేలింది. వీరంతా ఏడేళ్లలోపు చిన్నారులే కావడం ఆందోళన కలిగిస్తోంది. విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా పరీక్షలు చేయించగా మరో 25 మందికి కరోనా నిర్థారణ అయింది. దీంతో గ్రామంలో ఒక్కరోజే 39 మంది కరోనా బారినపడ్డారు. భట్లూరు ఎస్సీ కాలనీని కంటైన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించిన అధికారులు అక్కడ పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. 


గ్రామంలో మైక్‌ ద్వారా కరోనాపై అవగాహన కల్పిస్తున్నారు. గ్రామంలో ప్రత్యేక వైద్యశిబిరం ఏర్పాటు చేసి ప్రజల నుంచి నమూనాలు 



సేకరిస్తున్నారు. వైరస్‌ బాధితులందరినీ క్వారంటైన్‌ కేంద్రానికి తరలించారు. విద్యాసంస్థలు ఆన్‌లైన్‌ తరగతులు తప్ప .. నేరుగా క్లాసులు నిర్వహించకూడదనే నిబంధనలు ఉల్లంఘించినందుకు ఉపాధ్యాయుడికి విద్యాశాఖ నోటీసులు జారీ చేసింది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to " ఉపాధ్యాయుడి ద్వారా 39మందికి కరోనా "

Post a Comment